పల్లవి:
ఎందుకో సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి
అంత సిగ్గు ఎందుకో ...
ఎందుకో సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి
అంత సిగ్గు ఎందుకో ...
పంతాలే తీరెనని తెలిసినందుకే ...మనసులు కలసినందుకే
అందుకే సిగ్గందుకే . .
చరణం 1:
చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్ళకు వలపు పిలుపు
చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్ళకు వలపు పిలుపు
చిరునవ్వుల చిన్నారీ....
చిరునవ్వుల చిన్నారీ
ఇంకా సిగ్గెందుకే
ఎందుకో సిగ్గెందుకో
చరణం 2:
కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై
కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై
తనివారగ ఈ వేళా ...
తనివారగ ఈ వేళా....
మనసే తూగాడెనే
అందుకే... సిగ్గందుకే
చరణం 3:
నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే
నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే
అనురాగం ఆనందం...
అనురాగం ఆనందం...అన్నీ నీ కోసమే
అందుకా ఆ . . .సిగ్గందుకా ఆ . . .
పంతాలు తీరెనని తెలిసినందుకా
మనసులు కలిసినందుకే... అందుకే సిగ్గందుకే
pallavi:
ĕṁdugo siggĕṁdugo iṁtalone ammāyigi
aṁta siggu ĕṁdugo ...
ĕṁdugo siggĕṁdugo iṁtalone ammāyigi
aṁta siggu ĕṁdugo ...
paṁtāle tīrĕnani tĕlisinaṁduge ...manasulu kalasinaṁduge
aṁduge siggaṁduge . .
saraṇaṁ 1:
sinnanāḍi silibi talabu innāḽḽagu valabu pilubu
sinnanāḍi silibi talabu innāḽḽagu valabu pilubu
sirunavvula sinnārī....
sirunavvula sinnārī
iṁkā siggĕṁduge
ĕṁdugo siggĕṁdugo
saraṇaṁ 2:
kŏnasāgina korigale muribiṁchĕnu veḍugalai
kŏnasāgina korigale muribiṁchĕnu veḍugalai
tanivāraga ī veḽā ...
tanivāraga ī veḽā....
manase tūgāḍĕne
aṁduge... siggaṁduge
saraṇaṁ 3:
nunusiggula tĕrasāḍuna anurāgaṁ dāgĕnule
nunusiggula tĕrasāḍuna anurāgaṁ dāgĕnule
anurāgaṁ ānaṁdaṁ...
anurāgaṁ ānaṁdaṁ...annī nī kosame
aṁdugā ā . . .siggaṁdugā ā . . .
paṁtālu tīrĕnani tĕlisinaṁdugā
manasulu kalisinaṁduge... aṁduge siggaṁduge