పల్లవి:
ఎందుకే నీకింత తొందరా
ఇన్నాళ్ళ చెరసాల ఈ రేయి తీరునే
ఎందుకే నీకింత తొందర
ఓ చిలుక! నా చిలుకా..ఆ
ఓ చిలుక! నా చిలుకా... ఓ రామచిలుక!
వయ్యారి చిలుక! నా గారాల మొలక!
ఎందుకే నీకింత తొందరా
చరణం 1:
బాధలన్నీ పాత గాధలైపోవునే
బాధలన్నీ పాత గాధలైపోవునే
వంతలన్నీ వెలుగు పుంతలో మాయునే
యేలాగో ఓలాగు ఈ రేయి దాటెనా....ఈ రేయి దాటెనా
ఈ పంజరపు బ్రతుకు ఇక నీకు తీరునే
ఎందుకే నీకింత తొందర
చరణం 2:
ఆ చోట ఆ చోటఆ తోపు ఆకుపచ్చని గూడు
ఆ వంక గొరవంక అన్నీ ఉన్నాయి లే
ఆ వంక గొరవంక అన్నీ ఉన్నాయి లే
చిరుగాలి తరగలా.. చిన్నారి పడవలా
పసరు రెక్కలు పరచి పరువెత్తి పోదాము
ఎందుకే నీకింత తొందర
pallavi:
ĕṁduge nīgiṁta tŏṁdarā
innāḽḽa sĕrasāla ī reyi tīrune
ĕṁduge nīgiṁta tŏṁdara
o siluga! nā silugā..ā
o siluga! nā silugā... o rāmasiluga!
vayyāri siluga! nā gārāla mŏlaga!
ĕṁduge nīgiṁta tŏṁdarā
saraṇaṁ 1:
bādhalannī pāda gādhalaibovune
bādhalannī pāda gādhalaibovune
vaṁtalannī vĕlugu puṁtalo māyune
yelāgo olāgu ī reyi dāḍĕnā....ī reyi dāḍĕnā
ī paṁjarabu bradugu iga nīgu tīrune
ĕṁduge nīgiṁta tŏṁdara
saraṇaṁ 2:
ā soḍa ā soḍaā tobu āgubachchani gūḍu
ā vaṁka gŏravaṁka annī unnāyi le
ā vaṁka gŏravaṁka annī unnāyi le
sirugāli taragalā.. sinnāri paḍavalā
pasaru rĕkkalu parasi paruvĕtti podāmu
ĕṁduge nīgiṁta tŏṁdara