ఎందుకైనాఁ జెప్పేవటే యెరికెత నీవు నాకు
(॥పల్లవి॥)
ఎందుకైనాఁ జెప్పేవటే యెరికెత నీవు నాకు
యెందుకైనా నోపుదువు యెఱుఁగుదుఁ బదరా
(॥ఎందు॥)
వానకుఁ జెప్పేవటే నన్నెయెరికెత నీవు
ఆప నీమైఁ జెమటవా నదె కదరా
పూని వంటకుఁ జేప్పేవా బొంకుయెరికెత నీవు
చేనిపంట రాసులుగాఁ జేసేవురా మోవిని
(॥ఎందు॥)
మేలుకుఁ జేప్పేవటే మిండయెరికెత నీవు
మేలు సేసితివిరా నామీఁదనే నీవు
యేలుభూమికిఁ జెప్పేవా ఇంకా యెరికత నీవు
యేలుకొంటి భూమి సిరి నిట తొల్లేకదరా
(॥ఎందు॥)
వచ్చే మీఁదిపని చెప్పేవా యెరికెత నీవు
వచ్చేది నాకాఁగిలేరా వంతుల నీకు
నిచ్చలు నిట్టె చెప్పవే నీటుయెరికెత నాకు
నిచ్చలు శ్రీవేంకటేశ నిన్ను నేఁ గూడితిరా
(||pallavi||)
ĕṁdugainām̐ jĕppevaḍe yĕrigĕda nīvu nāgu
yĕṁdugainā nobuduvu yĕṟum̐gudum̐ badarā
(||ĕṁdu||)
vānagum̐ jĕppevaḍe nannĕyĕrigĕda nīvu
āba nīmaim̐ jĕmaḍavā nadĕ kadarā
pūni vaṁṭagum̐ jeppevā bŏṁkuyĕrigĕda nīvu
senibaṁṭa rāsulugām̐ jesevurā movini
(||ĕṁdu||)
melugum̐ jeppevaḍe miṁḍayĕrigĕda nīvu
melu sesidivirā nāmīm̐dane nīvu
yelubhūmigim̐ jĕppevā iṁkā yĕrigada nīvu
yelugŏṁṭi bhūmi siri niḍa tŏllegadarā
(||ĕṁdu||)
vachche mīm̐dibani sĕppevā yĕrigĕda nīvu
vachchedi nāgām̐gilerā vaṁtula nīgu
nichchalu niṭṭĕ sĕppave nīḍuyĕrigĕda nāgu
nichchalu śhrīveṁkaḍeśha ninnu nem̐ gūḍidirā