ఎందుకైనాఁ దానేవచ్చీ నేమిసేతునే
(॥పల్లవి॥)
ఎందుకైనాఁ దానేవచ్చీ నేమిసేతునే
యిందరివాఁడూఁ దానే యేమిసేతునే
(॥ఎందు॥)
గద్దరి సవతులము కాఁతాళాన నుండఁగాను
యిద్దరి నొక్కటిసేసీ నేమిసేతునే
పెద్దరికాన నొటు పెట్టుకుండఁగా నిదె
వద్దన్నా బొత్తులఁబెట్టీ వడి నేమిసేతునే
(॥ఎందు॥)
చయ్యాటపుమాటలు సారెసారె నాడఁగాను
యియ్యకోళ్లుగాఁ జెప్పీ నేమిసేతునే
కయ్యములు వద్దంటా గక్కనఁ బ్రియాలు చెప్పి
ఇయ్యరానిబాసలెల్లా నిచ్చీనేమిసేతునే
(॥ఎందు॥)
మరిగి మాఁటు సేసుక మామాఇండ్ల నుండఁగా
ఇరుమేలాఁ బెట్టుకొనీ నేమిసేతునే
అరుదై శ్రీవేంకటేశుఁ డక్క చెల్లెండ్లము మ
మ్మిరవుగాఁ బెండ్లాడె సేమిసేతునే
(||pallavi||)
ĕṁdugainām̐ dānevachchī nemisedune
yiṁdarivām̐ḍūm̐ dāne yemisedune
(||ĕṁdu||)
gaddari savadulamu kām̐tāḽāna nuṁḍam̐gānu
yiddari nŏkkaḍisesī nemisedune
pĕddarigāna nŏḍu pĕṭṭuguṁḍam̐gā nidĕ
vaddannā bŏttulam̐bĕṭṭī vaḍi nemisedune
(||ĕṁdu||)
sayyāḍabumāḍalu sārĕsārĕ nāḍam̐gānu
yiyyagoḽlugām̐ jĕppī nemisedune
kayyamulu vaddaṁṭā gakkanam̐ briyālu sĕppi
iyyarānibāsalĕllā nichchīnemisedune
(||ĕṁdu||)
marigi mām̐ṭu sesuga māmāiṁḍla nuṁḍam̐gā
irumelām̐ bĕṭṭugŏnī nemisedune
arudai śhrīveṁkaḍeśhum̐ ḍakka sĕllĕṁḍlamu ma
mmiravugām̐ bĕṁḍlāḍĕ semisedune