Emdaru leru sadulu yennennisamdaalavaaru

ఎందరు లేరు సతులు యెన్నెన్నిచందాలవారు
Language

(॥పల్లవి॥)
ఎందరు లేరు సతులు యెన్నెన్నిచందాలవారు
చెంది నీ నా పొందువలెఁ జెప్పరాదు గాని

(॥॥)
వేడుకమాట లెన్నైనా వేవేలు నాడఁగవచ్చు
కూడిమాడివుండేది గురుతుగాని
చూడఁజూడ వినయాలు సూడిదెలు వట్టవచ్చు
యీడఁ జోడైన వలపు లెక్కుడు గాని

(॥॥)
ననిచి యెంతవడైనా నవ్వులు నవ్వుఁగవచ్చు
మనసెనసి వుండుటే మర్మము గాని
చెనకి వినోదపుచేఁతలు సేయఁ గనచ్చు
కొనసాగెడుకూటమే కొరయౌఁగాని

(॥॥)
యెదురుబడి నుండి ఇంపులు చల్లఁగవచ్చు
వదలనికాఁగిళ్లే వైపులు గాని
ఇదివో శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
పొదిగొన్న సంతోసాలే పోదులౌ గాని

(||pallavi||)
ĕṁdaru leru sadulu yĕnnĕnnisaṁdālavāru
sĕṁdi nī nā pŏṁduvalĕm̐ jĕpparādu gāni

(||||)
veḍugamāḍa lĕnnainā vevelu nāḍam̐gavachchu
kūḍimāḍivuṁḍedi gurudugāni
sūḍam̐jūḍa vinayālu sūḍidĕlu vaṭṭavachchu
yīḍam̐ joḍaina valabu lĕkkuḍu gāni

(||||)
nanisi yĕṁtavaḍainā navvulu navvum̐gavachchu
manasĕnasi vuṁḍuḍe marmamu gāni
sĕnagi vinodabusem̐talu seyam̐ ganachchu
kŏnasāgĕḍugūḍame kŏrayaum̐gāni

(||||)
yĕdurubaḍi nuṁḍi iṁpulu sallam̐gavachchu
vadalanigām̐giḽle vaibulu gāni
idivo śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
pŏdigŏnna saṁtosāle podulau gāni