ఎందరు లేరు నీకు నెగసక్యాలు సేయఁగ
(॥పల్లవి॥)
ఎందరు లేరు నీకు నెగసక్యాలు సేయఁగ
మందలించే ఆడనుండే మన్నించవయ్యా
(॥ఎంద॥)
మొక్కలపుచేఁతలకు మొదలివాఁడవు నీవు
తక్కరివిద్యలకెల్లా దాఁపిరమవు
నెక్కొని చయ్యాటాలకు నేమా నీకు నెదురు
మక్కళించి మొక్కేము మన్నించవయ్యా
(॥ఎంద॥)
తీపులు వుట్టించి పొంద దేవర విన్నిటాను
రాఁపుచేసి నవ్వు నవ్వ రాజవు నీవు
యీపనులకెల్లా నీతో నియ్యకొనఁగలమా
మాపు రేపు సేవసేసే మన్నించవయ్యా
(॥ఎంద॥)
వట్టివలపులు రేఁచ వగకాఁడ వన్నిటాను
పట్టినచలములకు బలువాఁడవు
ఇట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
మట్టులేనివేసాలేల మన్నించవయ్యా
(||pallavi||)
ĕṁdaru leru nīgu nĕgasakyālu seyam̐ga
maṁdaliṁche āḍanuṁḍe manniṁchavayyā
(||ĕṁda||)
mŏkkalabusem̐talagu mŏdalivām̐ḍavu nīvu
takkarividyalagĕllā dām̐piramavu
nĕkkŏni sayyāḍālagu nemā nīgu nĕduru
makkaḽiṁchi mŏkkemu manniṁchavayyā
(||ĕṁda||)
tībulu vuṭṭiṁchi pŏṁda devara vinniḍānu
rām̐pusesi navvu navva rājavu nīvu
yībanulagĕllā nīdo niyyagŏnam̐galamā
mābu rebu sevasese manniṁchavayyā
(||ĕṁda||)
vaṭṭivalabulu rem̐sa vagagām̐ḍa vanniḍānu
paṭṭinasalamulagu baluvām̐ḍavu
iṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
maṭṭulenivesālela manniṁchavayyā