ఎందరిఁ బెండ్లాడేవు ఇంకా నీవు
(॥పల్లవి॥)
ఎందరిఁ బెండ్లాడేవు ఇంకా నీవు
కందువ నీకు ముఁ(ముం?)జేతికంకణమాయను
(॥ఎంద॥)
చెప్పరానివూడిగాలు సేసిసేసి నీకు నాపె
దెప్పరాన మోహపుదేవులాయను
యెప్పుడు చూచిన నీతో నేకతములెల్లా నాడి
అప్పనము వురముపై హారము నీకాయను
(॥ఎంద॥)
అంచెల నాపె నీకు నాకుచుట్టి ఇచ్చిఇచ్చి
వంచనతోఁ గడుఁజనవరి యాయను
కొంచక నాపాదాలు కూరిమితో నొత్తి మేలు
నించి నీకు నరచేతినిమ్మపండాయను
(॥ఎంద॥)
నెక్నొని యలమేల్‌మంగ నీకాఁగిఁటఁ గూడికూడి
చొక్కిచొక్కి పాయరానిచుట్టమాయను
ఇక్కడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నిక్కి తానెనసి తోడినీడ నీకాయను
(||pallavi||)
ĕṁdarim̐ bĕṁḍlāḍevu iṁkā nīvu
kaṁduva nīgu mum̐(muṁ?)jedigaṁkaṇamāyanu
(||ĕṁda||)
sĕpparānivūḍigālu sesisesi nīgu nābĕ
dĕpparāna mohabudevulāyanu
yĕppuḍu sūsina nīdo negadamulĕllā nāḍi
appanamu vuramubai hāramu nīgāyanu
(||ĕṁda||)
aṁchĕla nābĕ nīgu nāgusuṭṭi ichchiichchi
vaṁchanadom̐ gaḍum̐janavari yāyanu
kŏṁchaga nābādālu kūrimido nŏtti melu
niṁchi nīgu narasedinimmabaṁḍāyanu
(||ĕṁda||)
nĕknŏni yalamelmaṁga nīgām̐gim̐ṭam̐ gūḍigūḍi
sŏkkisŏkki pāyarānisuṭṭamāyanu
ikkaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
nikki tānĕnasi toḍinīḍa nīgāyanu