ఎందాఁకా వంకలుదిద్దే వీతని సుద్దులు నాతో
(॥పల్లవి॥)
ఎందాఁకా వంకలుదిద్దే వీతని సుద్దులు నాతో
పందెగాఁడై తానిట్లా బదుకనీఁగదవే
(॥ఎందా॥)
చెల్లుబడిగలవారు సేసినదెల్లాఁ జేఁతే
అల్లదె ఔఁగాదని ఆడఁగనేల
పల్లదాన నేఁ దప్పులు పట్టేటిదాననా
బల్లిదుఁడై తానిట్టా బదుకనీఁగదవే
(॥ఎందా॥)
పంతగాండ్లైనవారు పట్టినదెల్లా మాఁటే
యెంతకెంత తనగర్వా లెంచఁగనేల
పొంతనుండి నేఁ దనకు బుద్దినేరిపేదానా
బంతి నుండి తానిట్లా బదుకనీఁగదవే
(॥ఎందా॥)
కూరిమిగలుగువారు కూడినదెల్లాఁ గూటమి
సారెకుఁ గోసరి యింతజఱయనేల
యీరీతి శ్రీవేంకటేశుఁ డెనసె నింకఁ బాసేనా
బారకుఁడై తానిట్లా బదుకనీఁగదవే
(||pallavi||)
ĕṁdām̐kā vaṁkaludidde vīdani suddulu nādo
paṁdĕgām̐ḍai tāniṭlā baduganīm̐gadave
(||ĕṁdā||)
sĕllubaḍigalavāru sesinadĕllām̐ jem̐te
alladĕ aum̐gādani āḍam̐ganela
palladāna nem̐ dappulu paṭṭeḍidānanā
ballidum̐ḍai tāniṭṭā baduganīm̐gadave
(||ĕṁdā||)
paṁtagāṁḍlainavāru paṭṭinadĕllā mām̐ṭe
yĕṁtagĕṁta tanagarvā lĕṁcham̐ganela
pŏṁtanuṁḍi nem̐ danagu buddineribedānā
baṁti nuṁḍi tāniṭlā baduganīm̐gadave
(||ĕṁdā||)
kūrimigaluguvāru kūḍinadĕllām̐ gūḍami
sārĕgum̐ gosari yiṁtajaṟayanela
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ niṁkam̐ bāsenā
bāragum̐ḍai tāniṭlā baduganīm̐gadave