(॥పల్లవి॥)
ఎందాఁకా సరసమాడే వేమయ్యా
పొందుగా నలపుదీర్చి భోగించరాదా
(॥॥)
చక్కనిజవ్వని నీవు సారెకు నవ్వించఁ గాను
చెక్కులునిండాఁ గడుఁ జెమరించెను
ఇక్కువ లంటుకొనుచు నీవు యిట్టె పెనఁగులాడఁగా
ముక్కున నిట్టూర్పులు ముంచుకొనెను
(॥॥)
గారాపుదానిచేతఁ గతలు చెప్పించుకోఁగా
పేరి పెదవిపైఁ దమ్మబేంట్లు రాలెను
గోరనంటి పయ్యదలో గుబ్బలు గదలించఁగా
జారి కొప్పుతో విరులు జల్లనరాలీని
(॥॥)
కోమలి నింతలో నీవు కొసరి కాఁగిలించగా
అముక విరిబాగులాయ మేనెల్లా
కామించి శ్రీ వేంకటేశ కలికిని నీ వేలఁగా
వేమారు మోవితేనెలు వేడుకలు రేఁచెను
(||pallavi||)
ĕṁdām̐kā sarasamāḍe vemayyā
pŏṁdugā nalabudīrsi bhogiṁcharādā
(||||)
sakkanijavvani nīvu sārĕgu navviṁcham̐ gānu
sĕkkuluniṁḍām̐ gaḍum̐ jĕmariṁchĕnu
ikkuva laṁṭugŏnusu nīvu yiṭṭĕ pĕnam̐gulāḍam̐gā
mukkuna niṭṭūrbulu muṁchugŏnĕnu
(||||)
gārābudānisedam̐ gadalu sĕppiṁchugom̐gā
peri pĕdavibaim̐ dammabeṁṭlu rālĕnu
goranaṁṭi payyadalo gubbalu gadaliṁcham̐gā
jāri kŏppudo virulu jallanarālīni
(||||)
komali niṁtalo nīvu kŏsari kām̐giliṁchagā
amuga viribāgulāya menĕllā
kāmiṁchi śhrī veṁkaḍeśha kaligini nī velam̐gā
vemāru movidenĕlu veḍugalu rem̐sĕnu