Emdaamkaa neesala memi gattugomtivi

ఎందాఁకా నీచల మేమి గట్టుకొంటివి
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా నీచల మేమి గట్టుకొంటివి
యిందువంకనే దొర విన్నిటా నీ వైతివి

(॥ఎందాఁ॥)
పలుకరాదా కొంత పరాకు మానరాదా
పిలిచి పెదవులెల్లా బెండుపడెనుఁ
సెలవుల నవ్వరాదా చెంతల దగ్గరరాదా
నిలువు నివ్వెరగాయ నీకుఁగానే ప్రేమను

(॥ఎందాఁ॥)
చక్కఁగాఁ జూడఁగరాదా చలము మానఁగరాదా
మొక్కి మొక్కి చేతులెల్లా మొనలాయను
మక్కువతో వినరాదా మన్నన లియ్యఁగరాదా
యిక్కువలు విన్నవించి యెలుఁగెల్లా రాసెను

(॥ఎందాఁ॥)
యింటి కిట్టె రారాదా యిటు నన్నుఁ గూడరాదా
వెంటవెంటఁ దిరిగాడి వేసటాయను
అంటి ముట్టి శ్రీవేంకటాదీశ యేలితివి
నంటున నీతోడిరతి నాభాగ్యమాయను

(||pallavi||)
ĕṁdām̐kā nīsala memi gaṭṭugŏṁṭivi
yiṁduvaṁkane dŏra vinniḍā nī vaidivi

(||ĕṁdām̐||)
palugarādā kŏṁta parāgu mānarādā
pilisi pĕdavulĕllā bĕṁḍubaḍĕnum̐
sĕlavula navvarādā sĕṁtala daggararādā
niluvu nivvĕragāya nīgum̐gāne premanu

(||ĕṁdām̐||)
sakkam̐gām̐ jūḍam̐garādā salamu mānam̐garādā
mŏkki mŏkki sedulĕllā mŏnalāyanu
makkuvado vinarādā mannana liyyam̐garādā
yikkuvalu vinnaviṁchi yĕlum̐gĕllā rāsĕnu

(||ĕṁdām̐||)
yiṁṭi kiṭṭĕ rārādā yiḍu nannum̐ gūḍarādā
vĕṁṭavĕṁṭam̐ dirigāḍi vesaḍāyanu
aṁṭi muṭṭi śhrīveṁkaḍādīśha yelidivi
naṁṭuna nīdoḍiradi nābhāgyamāyanu