Emdaamkaa nedamaada lemtigi talavampulu

ఎందాఁకా నెడమాట లేఁటికి తలవంపులు
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా నెడమాట లేఁటికి తలవంపులు
ముందర నుండితేఁ జాలు ముచ్చటెల్లఁ బాసును

(॥ఎందాఁ॥)
నెఱజాణ రమణుఁడ నీకేమి బుద్ది లేదా
మఱి పొరిగింతికైనా మానములేదా
మఱగేల మీలోన మాటలాడే అందుకుఁగా
తెఱవల నడిగితే తేటలెల్లమౌను

(॥ఎందాఁ॥)
అంగజగురుఁడ నీవైనా మరచితివా
అంగనైనా దలఁచుక ఆడవద్దా
వుంగిటెల్ల నీలోన వొందినవే అందుకుఁగా
ముంగిట నుండితేఁ జాలు మోహమెల్లా రేఁగును

(॥ఎందాఁ॥)
శ్రీ వేంకటేశ నీకైన చిత్తము నేఁడు వచ్చెనా
వావిరి నేఁ డాపెకైన వరుసాయనా
యీవల గూడితిరి మీరిద్దరును నొక్కమాఁటే
భావించుకొనుఁడు మీపంతమెల్ల దక్కును

(||pallavi||)
ĕṁdām̐kā nĕḍamāḍa lem̐ṭigi talavaṁpulu
muṁdara nuṁḍidem̐ jālu muchchaḍĕllam̐ bāsunu

(||ĕṁdām̐||)
nĕṟajāṇa ramaṇum̐ḍa nīgemi buddi ledā
maṟi pŏrigiṁtigainā mānamuledā
maṟagela mīlona māḍalāḍe aṁdugum̐gā
tĕṟavala naḍigide teḍalĕllamaunu

(||ĕṁdām̐||)
aṁgajagurum̐ḍa nīvainā marasidivā
aṁganainā dalam̐suga āḍavaddā
vuṁgiḍĕlla nīlona vŏṁdinave aṁdugum̐gā
muṁgiḍa nuṁḍidem̐ jālu mohamĕllā rem̐gunu

(||ĕṁdām̐||)
śhrī veṁkaḍeśha nīgaina sittamu nem̐ḍu vachchĕnā
vāviri nem̐ ḍābĕgaina varusāyanā
yīvala gūḍidiri mīriddarunu nŏkkamām̐ṭe
bhāviṁchugŏnum̐ḍu mībaṁtamĕlla dakkunu