Emdaamkaa moosimamtanaa lela sesevu

ఎందాఁకా మూసిమంతనా లేల సేసేవు
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా మూసిమంతనా లేల సేసేవు
పందెగాఁడవై నీవే పడితళించ రాదా

(॥ఎందాఁ॥)
అంకెల నీవద్ద నుండి యాపెయాడేమాటలెల్లా
వంకలొత్తి చక్కదిద్దవలెనా నీవు
పొంకముగా నేరకేంట పూనుక నీవే వచ్చి
తెంకి నుండి మాతోను దీకొనఁగరాదా

(॥ఎందాఁ॥)
చుట్టిచుట్టి యా నాతో జూజాలాడి యోడఁగాను
రట్టుగా నెత్తులు చెప్ప ఇట్టె వలెనా
నెట్టన నీ కంతేసి(నెఁ(నెం?) జెరివి గలితేను
పట్టి నీవె సారెలు పన్ను కొనరాదా

(॥ఎందాఁ॥)
ముంచి నాకాపె చెల్లెలై మొక్క నేరక వుండఁగా
వంచనఁ జేతులు కూడ వంచేవు నీవు
యెంచగ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నీవు
కొంచి యాపె యుండితే నీకు మొక్కించుకోరాదా

(||pallavi||)
ĕṁdām̐kā mūsimaṁtanā lela sesevu
paṁdĕgām̐ḍavai nīve paḍidaḽiṁcha rādā

(||ĕṁdām̐||)
aṁkĕla nīvadda nuṁḍi yābĕyāḍemāḍalĕllā
vaṁkalŏtti sakkadiddavalĕnā nīvu
pŏṁkamugā nerageṁṭa pūnuga nīve vachchi
tĕṁki nuṁḍi mādonu dīgŏnam̐garādā

(||ĕṁdām̐||)
suṭṭisuṭṭi yā nādo jūjālāḍi yoḍam̐gānu
raṭṭugā nĕttulu sĕppa iṭṭĕ valĕnā
nĕṭṭana nī kaṁtesi(nĕm̐(nĕṁ?) jĕrivi galidenu
paṭṭi nīvĕ sārĕlu pannu kŏnarādā

(||ĕṁdām̐||)
muṁchi nāgābĕ sĕllĕlai mŏkka neraga vuṁḍam̐gā
vaṁchanam̐ jedulu kūḍa vaṁchevu nīvu
yĕṁchaga śhrī veṁkaḍeśha yelidivi nannu nīvu
kŏṁchi yābĕ yuṁḍide nīgu mŏkkiṁchugorādā