Emdaamkaa mamkumdana mimta galadaa

ఎందాఁకా మంకుఁదన మింత గలదా
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా మంకుఁదన మింత గలదా
విందుచెప్ప నాతఁడు వేడుకపడీని

(॥ఎందా॥)
చలపాదితనమేల సరసములాడఁగదే
అలరి వేడుకపడీనాతఁడందుకు
తలవంచుకుండనేలతప్పకచూడఁగదవె
నెలవున నీమొకమై నిలుచున్నాడతఁడు

(॥ఎందా॥)
పంతము లింతోనేల పట్టఁగదవే విడెము
వింతగాఁ దమకించీనివిభుఁడించుకు
చింతలో నుండఁగనేలచిమ్మిరేఁగి నవ్వఁగదె
చెంతనేకాచుకుండి చెలఁగీ నతఁడు

(॥ఎందా॥)
సిగ్గులువడఁగనేల చేకొని కూడఁగదవె
వెగ్గళించీశ్రీవేంకటవిభుఁడిందుకు
తగ్గనియాసోదమేలేతనిసి మెచ్చఁగదవే
నిగ్గుల నిన్నేలి మేలు నిండించీ నతఁడు

(||pallavi||)
ĕṁdām̐kā maṁkum̐dana miṁta galadā
viṁdusĕppa nādam̐ḍu veḍugabaḍīni

(||ĕṁdā||)
salabādidanamela sarasamulāḍam̐gade
alari veḍugabaḍīnādam̐ḍaṁdugu
talavaṁchuguṁḍaneladappagasūḍam̐gadavĕ
nĕlavuna nīmŏgamai nilusunnāḍadam̐ḍu

(||ĕṁdā||)
paṁtamu liṁtonela paṭṭam̐gadave viḍĕmu
viṁtagām̐ damagiṁchīnivibhum̐ḍiṁchugu
siṁtalo nuṁḍam̐ganelasimmirem̐gi navvam̐gadĕ
sĕṁtanegāsuguṁḍi sĕlam̐gī nadam̐ḍu

(||ĕṁdā||)
sigguluvaḍam̐ganela segŏni kūḍam̐gadavĕ
vĕggaḽiṁchīśhrīveṁkaḍavibhum̐ḍiṁdugu
tagganiyāsodameledanisi mĕchcham̐gadave
niggula ninneli melu niṁḍiṁchī nadam̐ḍu