Emdaamkaa joli davvee nemtiganare

ఎందాఁకా జోలి దవ్వీ నేఁటికనరే
Language

(॥పల్లవి॥)
ఎందాఁకా జోలి దవ్వీ నేఁటికనరే
విందానఁ దొల్లి నేను విడువరే మీరు

(॥ఎందా॥)
వద్దు వద్దు తాను వట్టినిద్రతొడుసు
అద్దో మాయింటికి నన్నంపించరే
యిద్దరము నిద్దరమే యెకసెక్కెములకైతే
తిద్దలేరు మాగుణాలు తిరిగి పోఁగదరే

(॥ఎందా॥)
ప్రియములేనిమాట పెదవికి సంగరము
నయగారా లివియెల్లా నమ్మనోపనే
జయ మొకరొకరిలో చలములే వెగ్గళాలు
లయ లెరఁగరు మీరు లాగు లటు చూడరే

(॥ఎందా॥)
కారణములేనినవ్వు కనుచూపులకొలఁది
తేరెఁ బను లన్నిటాను తేజ మనరే
యీరీతి శ్రీవేంకటేశుఁ డిప్పు డిట్టె నన్నుఁగూడె
మారుకొనక మీ రొక్కమనసున నుండరే

(||pallavi||)
ĕṁdām̐kā joli davvī nem̐ṭiganare
viṁdānam̐ dŏlli nenu viḍuvare mīru

(||ĕṁdā||)
vaddu vaddu tānu vaṭṭinidradŏḍusu
addo māyiṁṭigi nannaṁpiṁchare
yiddaramu niddarame yĕgasĕkkĕmulagaide
tiddaleru māguṇālu tirigi pom̐gadare

(||ĕṁdā||)
priyamulenimāḍa pĕdavigi saṁgaramu
nayagārā liviyĕllā nammanobane
jaya mŏgarŏgarilo salamule vĕggaḽālu
laya lĕram̐garu mīru lāgu laḍu sūḍare

(||ĕṁdā||)
kāraṇamuleninavvu kanusūbulagŏlam̐di
terĕm̐ banu lanniḍānu teja manare
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍippu ḍiṭṭĕ nannum̐gūḍĕ
mārugŏnaga mī rŏkkamanasuna nuṁḍare