ఎందాఁకా బుద్దిచెప్పే విప్పుడు మాకు
(॥పల్లవి॥)
ఎందాఁకా బుద్దిచెప్పే విప్పుడు మాకు
ముందరనే వున్నదాన ముట్టుకోకు మమ్మును
(॥ఎందాఁ॥)
నేరుపరులై నవారు నీతోఁబొందుసేసేరు
నేరనివారు గలితే నిందుకుండేరు
దూరనేల పోరనేల తొల్లె నీయింటిలోన
సారె జరయకు నన్ను జారుఁగొప్పుదానను
(॥ఎందాఁ॥)
పాయరానియట్టివారు భ్రమసి లోనయ్యేరు
చాయపాటువారెల్లా చక్కనుండేరు
రాయడేల రంతులేల రతికెక్కి పానుపుపై
చేయి చెక్కునఁ బెట్టుక సిగ్గుతో నుందానను
(॥ఎందాఁ॥)
మునుపవచ్చినవారు మొక్కలానఁ గూడురు
వెనకవచ్చినవారు వేరే కూడేరు
యెనసితివి శ్రీవేంకటేశ యింతలోనె నన్ను
తనిసి నే నున్న దాన తక్కించకు మిఁకను
(||pallavi||)
ĕṁdām̐kā buddisĕppe vippuḍu māgu
muṁdarane vunnadāna muṭṭugogu mammunu
(||ĕṁdām̐||)
nerubarulai navāru nīdom̐bŏṁduseseru
neranivāru galide niṁduguṁḍeru
dūranela poranela tŏllĕ nīyiṁṭilona
sārĕ jarayagu nannu jārum̐gŏppudānanu
(||ĕṁdām̐||)
pāyarāniyaṭṭivāru bhramasi lonayyeru
sāyabāḍuvārĕllā sakkanuṁḍeru
rāyaḍela raṁtulela radigĕkki pānububai
seyi sĕkkunam̐ bĕṭṭuga siggudo nuṁdānanu
(||ĕṁdām̐||)
munubavachchinavāru mŏkkalānam̐ gūḍuru
vĕnagavachchinavāru vere kūḍeru
yĕnasidivi śhrīveṁkaḍeśha yiṁtalonĕ nannu
tanisi ne nunna dāna takkiṁchagu mim̐kanu