Emchugommaa neegu neeve yee tagavulu

ఎంచుకొమ్మా నీకు నీవే యీ తగవులు
Language

(॥పల్లవి॥)
ఎంచుకొమ్మా నీకు నీవే యీ తగవులు
మంచితనానఁ జెలిని మన్నించవయ్యా

(॥ఎంచు॥)
వంతులకు వాసులకు వనితలు సొలచితే
వంతమాడిరంటా యెగ్గుపట్టఁదగునా
వింతలుగాఁ దీగెలు వసంత కాలానఁ జిగురు
యెంతపెంచినా నందు కిచ్చగించవలదా

(॥ఎంచు॥)
ననుపై నరమణులు నవ్వులెంత నవ్వినాను
ఘన గర్వములంటాను కాదందురా
యెనసి వానకాలాన యేరులు మించిపారితే
యెనలేనివేడుకతో నీఁదులాడవలదా

(॥ఎంచు॥)
రతివేళ వనితలు రాఁపు నిన్నుఁజేసితేను
తతిగొని నీవూఁ గడుఁదమకింతురా
క్షితి నాఁడుఁగోవిలలు చెలఁగి యెంత వుండినా
సతమై శ్రీవేంకటేశ సారె వినవలదా

(||pallavi||)
ĕṁchugŏmmā nīgu nīve yī tagavulu
maṁchidanānam̐ jĕlini manniṁchavayyā

(||ĕṁchu||)
vaṁtulagu vāsulagu vanidalu sŏlaside
vaṁtamāḍiraṁṭā yĕggubaṭṭam̐dagunā
viṁtalugām̐ dīgĕlu vasaṁta kālānam̐ jiguru
yĕṁtabĕṁchinā naṁdu kichchagiṁchavaladā

(||ĕṁchu||)
nanubai naramaṇulu navvulĕṁta navvinānu
ghana garvamulaṁṭānu kādaṁdurā
yĕnasi vānagālāna yerulu miṁchibāride
yĕnaleniveḍugado nīm̐dulāḍavaladā

(||ĕṁchu||)
radiveḽa vanidalu rām̐pu ninnum̐jesidenu
tadigŏni nīvūm̐ gaḍum̐damagiṁturā
kṣhidi nām̐ḍum̐govilalu sĕlam̐gi yĕṁta vuṁḍinā
sadamai śhrīveṁkaḍeśha sārĕ vinavaladā