ఎంచిచూచితే నావల్ల నేమున్నది గుణము
(॥పల్లవి॥)
ఎంచిచూచితే నావల్ల నేమున్నది గుణము
పంచల నాపాలన గడపవయ్య ఇఁకను
(॥॥)
పిలిపించుకొందురా ప్రియుఁడవు నిన్ను నేఁ
దలఁ చినప్పుడె రాఁ దగవుగాదా
వలపించితివి తొల్లె వద్దఁ బాయకుండాఁ జేసి
నిలుకడగాఁ గరుణించవయ్య యిఁకను
(॥॥)
గుట్టుచేసుకొందురా కోరి నేనీకు మొక్కఁ గా
నెట్టన నీవే నవ్వుట నేరుపుగాదా
చుట్టమవు నాకు నీవు సుద్దులు నాతోనే చెప్పి
యిట్టె నావ్రత మీడేర్చి యేలవయ్య యిఁకను
(॥॥)
మనసు సోదింతురా మర్మము నాకు నీవు
ఘనుఁడ శ్రీ వేంకటేశ్వర కలయరాదా
మునుపే నీయాలను నాముచ్చటెల్లా నీవు విని
యెనసి నాకిట్టె చనవియ్యవయ్య ఇఁకను
(||pallavi||)
ĕṁchisūside nāvalla nemunnadi guṇamu
paṁchala nābālana gaḍabavayya im̐kanu
(||||)
pilibiṁchugŏṁdurā priyum̐ḍavu ninnu nem̐
dalam̐ sinappuḍĕ rām̐ dagavugādā
valabiṁchidivi tŏllĕ vaddam̐ bāyaguṁḍām̐ jesi
nilugaḍagām̐ garuṇiṁchavayya yim̐kanu
(||||)
guṭṭusesugŏṁdurā kori nenīgu mŏkkam̐ gā
nĕṭṭana nīve navvuḍa nerubugādā
suṭṭamavu nāgu nīvu suddulu nādone sĕppi
yiṭṭĕ nāvrada mīḍersi yelavayya yim̐kanu
(||||)
manasu sodiṁturā marmamu nāgu nīvu
ghanum̐ḍa śhrī veṁkaḍeśhvara kalayarādā
munube nīyālanu nāmuchchaḍĕllā nīvu vini
yĕnasi nāgiṭṭĕ sanaviyyavayya im̐kanu