Emchinattu vadunaa yennige levvarigainaa

ఎంచినట్టు వడునా యెన్నికె లెవ్వరికైనా
Language

(॥పల్లవి॥)
ఎంచినట్టు వడునా యెన్నికె లెవ్వరికైనా
దించని తమకమున తేరి నవ్వే నేను

(॥ఎంచి॥)
గునియుచు నినుఁ బాసి కోపగించేనని వచ్చి
ననుపు నీ మాటలకు నవ్వే నేను
అనువుల నీ చేఁత నిన్నడిగే నేనఁగానే
ననుఁ జేయివట్టుకొంటే నవ్వే నేను

(॥ఎంచి॥)
ఆలరి మాఁటలు నిన్ను నాడేనంటా వచ్చి
నాలి నీ యానల కిట్టె నవ్వే నేను
జాలిఁ బెట్టి బొమ్మల జంకించి వలచిన
నాలాగు లిటు చూచి నవ్వే నేను

(॥ఎంచి॥)
కులికి కులికి నిన్ను గోరఁ జిమ్మేనని వచ్చి
నలి నలి మేను చూచి నవ్వే నేను
చెలఁగి మండెములోన శ్రీ వేంకటేశ కూడితి
నలువంక చెలులతో నవ్వేనేను

(||pallavi||)
ĕṁchinaṭṭu vaḍunā yĕnnigĕ lĕvvarigainā
diṁchani tamagamuna teri navve nenu

(||ĕṁchi||)
guniyusu ninum̐ bāsi kobagiṁchenani vachchi
nanubu nī māḍalagu navve nenu
anuvula nī sem̐ta ninnaḍige nenam̐gāne
nanum̐ jeyivaṭṭugŏṁṭe navve nenu

(||ĕṁchi||)
ālari mām̐ṭalu ninnu nāḍenaṁṭā vachchi
nāli nī yānala kiṭṭĕ navve nenu
jālim̐ bĕṭṭi bŏmmala jaṁkiṁchi valasina
nālāgu liḍu sūsi navve nenu

(||ĕṁchi||)
kuligi kuligi ninnu goram̐ jimmenani vachchi
nali nali menu sūsi navve nenu
sĕlam̐gi maṁḍĕmulona śhrī veṁkaḍeśha kūḍidi
naluvaṁka sĕlulado navvenenu