ఏమయ్యా వేడుకకాని కేడ దోసము
(॥పల్లవి॥)
ఏమయ్యా వేడుకకాని కేడ దోసము
వేమారు నీ దేవులకై విన్నవించేఁ గాక
(॥ఏమ॥)
సంగడించి మాటాడుతాఁ జవి చూచితివి మోవి
యెంగిలని చూడవద్దాయింతిని నేను
వెంగలితనానఁ దొల్లి వెన్నలుమఁ బాలును
దొంగిలినవాఁడనిదూరుకు నోడేవా
(॥ఏమ॥)
సముకాన నవ్వుతానే సరిఁగాఁగిలంచితివి
చెమటని చూడవద్దా చిప్పిలి మేన
గుమితానఁ జల్లలమ్మే గొల్లతలనేలిన
తమకి వంతేసిదొరతనాలు చూచేవా
(॥ఏమ॥)
అదరించి వేఁడుకొంటా నక్కున నిడుకోనేవు
పాదాలు దిఁకి సిబ్బితిపడఁగవద్దా
కాదనక దధిభాండు(డ?) గంపకిం దీఁగినవాఁడ
వీదెస శ్రీ వేంకటేశ యిందుకుఁ గొంకేవా
(||pallavi||)
emayyā veḍugagāni keḍa dosamu
vemāru nī devulagai vinnaviṁchem̐ gāga
(||ema||)
saṁgaḍiṁchi māḍāḍudām̐ javi sūsidivi movi
yĕṁgilani sūḍavaddāyiṁtini nenu
vĕṁgalidanānam̐ dŏlli vĕnnalumam̐ bālunu
dŏṁgilinavām̐ḍanidūrugu noḍevā
(||ema||)
samugāna navvudāne sarim̐gām̐gilaṁchidivi
sĕmaḍani sūḍavaddā sippili mena
gumidānam̐ jallalamme gŏlladalanelina
tamagi vaṁtesidŏradanālu sūsevā
(||ema||)
adariṁchi vem̐ḍugŏṁṭā nakkuna niḍugonevu
pādālu dim̐ki sibbidibaḍam̐gavaddā
kādanaga dadhibhāṁḍu(ḍa?) gaṁpagiṁ dīm̐ginavām̐ḍa
vīdĕsa śhrī veṁkaḍeśha yiṁdugum̐ gŏṁkevā