Emarimchi yimta sesi yelugomtivi

ఏమరించి యింత చేసి యేలుకొంటివి
Language

(॥పల్లవి॥)
ఏమరించి యింత చేసి యేలుకొంటివి
నేమము చెల్లించితివి నీవే పో జాణవు

(॥ఏమ॥)
యెందుఁ బరాకై వింటివొ యిప్పుడు నావిన్నపాలు
అంది కమ్మరా నన్నే యడిగేవు
పొంది యింతవడికైనా బుద్దివుఁట్టెఁగా నాపై
నింద దీర్చుకొంటి విఁక నీవేపో జాణవు

(॥ఏమ॥)
యేడనుండి విచ్చితివో యిప్పుడు మాయింటికాడ
తోడఁ బారుపత్యాలెల్లఁ దరి సేసేవు
వోడక యిన్నాళ్ళకైనా వొక్కటైతివిగా నాతో
నీడ నన్ను మెచ్చితివి నీవేపో జాణవు

(॥ఏమ॥)
యెట్టు వలచితో నాకు యెక్కువ నీకాఁగిటిలో
జట్టిగొని యిచ్చకాలు సారెఁ జల్లేవు
యిట్టె శ్రీవేంకటేశ యెడయవుగా నన్ను
నెట్టిన నావాఁడవైతి నీవేపో జాణవు

(||pallavi||)
emariṁchi yiṁta sesi yelugŏṁṭivi
nemamu sĕlliṁchidivi nīve po jāṇavu

(||ema||)
yĕṁdum̐ barāgai viṁṭivŏ yippuḍu nāvinnabālu
aṁdi kammarā nanne yaḍigevu
pŏṁdi yiṁtavaḍigainā buddivum̐ṭṭĕm̐gā nābai
niṁda dīrsugŏṁṭi vim̐ka nīvebo jāṇavu

(||ema||)
yeḍanuṁḍi vichchidivo yippuḍu māyiṁṭigāḍa
toḍam̐ bārubatyālĕllam̐ dari sesevu
voḍaga yinnāḽḽagainā vŏkkaḍaidivigā nādo
nīḍa nannu mĕchchidivi nīvebo jāṇavu

(||ema||)
yĕṭṭu valasido nāgu yĕkkuva nīgām̐giḍilo
jaṭṭigŏni yichchagālu sārĕm̐ jallevu
yiṭṭĕ śhrīveṁkaḍeśha yĕḍayavugā nannu
nĕṭṭina nāvām̐ḍavaidi nīvebo jāṇavu