Emaribaaduna nimti nimtaseduraa

ఏమరిపాటున నింతి నింతసేతురా
Language

(॥పల్లవి॥)
ఏమరిపాటున నింతి నింతసేతురా
దోమటాయ వలపులు తోడఁదోడ మాకును

(॥ఏమ॥)
నివ్వెరగుతోడఁ జెలి నిలుచుఁ(చుం?) డుండఁగాఁ జూచి
రవ్వై వుంటవింటఁ గప్పురాన వేసేవు
దవ్వుల నిన్ను నాపె అదరిపడి నిన్నుఁ జూచె
పువ్వుటమ్ములై తాకె పొంచి నీమర్మములు

(॥ఏమ॥)
చింతతోడఁ గడుఁ జెలి శిరసు వంచుకుండఁగా
పంతాన నాపెను పూబంతి చేసేవు
అంతలో చేతఁ దట్టితే నాపె గోరు నిన్ను సోఁకె
కంతునికై తప్పులాయ గక్కున నీమేనను

(॥ఏమ॥)
సిగ్గువడివున్న చెలిఁ జఱఁగువట్టి తీసేవు
బగ్గున నాపె గుబ్బలు పై మోపెను
యెగ్గనక శ్రీ వేంకటేశ మీరు గూడితిరి
వెగ్గళపురతులను వేవేలాయ వలపు

(||pallavi||)
emaribāḍuna niṁti niṁtasedurā
domaḍāya valabulu toḍam̐doḍa māgunu

(||ema||)
nivvĕragudoḍam̐ jĕli nilusum̐(suṁ?) ḍuṁḍam̐gām̐ jūsi
ravvai vuṁṭaviṁṭam̐ gappurāna vesevu
davvula ninnu nābĕ adaribaḍi ninnum̐ jūsĕ
puvvuḍammulai tāgĕ pŏṁchi nīmarmamulu

(||ema||)
siṁtadoḍam̐ gaḍum̐ jĕli śhirasu vaṁchuguṁḍam̐gā
paṁtāna nābĕnu pūbaṁti sesevu
aṁtalo sedam̐ daṭṭide nābĕ goru ninnu som̐kĕ
kaṁtunigai tappulāya gakkuna nīmenanu

(||ema||)
sigguvaḍivunna sĕlim̐ jaṟam̐guvaṭṭi tīsevu
bagguna nābĕ gubbalu pai mobĕnu
yĕgganaga śhrī veṁkaḍeśha mīru gūḍidiri
vĕggaḽaburadulanu vevelāya valabu