Emannaam jeyavayya iyyagone nimka nenu

ఏమన్నాఁ జేయవయ్య ఇయ్యకొనే నిఁక నేను
Language

(॥పల్లవి॥)
ఏమన్నాఁ జేయవయ్య ఇయ్యకొనే నిఁక నేను
నీ మనసు నేఁ దెలియనేర కింతే కాక

(॥ఏమ॥)
మించి చేయిపట్టఁగ గాదనేనా నేను
యేమందురో మావారనే దిందుకే కాక
దోమటి నానవెట్టఁగ దోసేనా ఇట్టె నన్ను -
నామని సిగ్గులు ముంచె అందుకింతే కాక

(॥ఏమ॥)
కొంగునట్టి తియ్యఁగాను కోపగించేనా నిన్ను
పొంగేటి సతవతులచే పోరుకే కాక
చెంగటఁ బిలువఁగాను చేరని నా గర్వమా
అంగపుఁ జమట నిన్ను నంటీనని కాక

(॥ఏమ॥)
మించిన నీ కాఁగి లిట్టె మెచ్చకున్న దాననా
ఇంచుక పరవశమై యిందుకే కాక
అంచెల శ్రీవేంకటేశ ఆదరించి కూడితివి
మంచిదానఁ గానా వొక్కమాఁట కింతే కాక

(||pallavi||)
emannām̐ jeyavayya iyyagŏne nim̐ka nenu
nī manasu nem̐ dĕliyanera kiṁte kāga

(||ema||)
miṁchi seyibaṭṭam̐ga gādanenā nenu
yemaṁduro māvārane diṁduge kāga
domaḍi nānavĕṭṭam̐ga dosenā iṭṭĕ nannu -
nāmani siggulu muṁchĕ aṁdugiṁte kāga

(||ema||)
kŏṁgunaṭṭi tiyyam̐gānu kobagiṁchenā ninnu
pŏṁgeḍi sadavadulase poruge kāga
sĕṁgaḍam̐ biluvam̐gānu serani nā garvamā
aṁgabum̐ jamaḍa ninnu naṁṭīnani kāga

(||ema||)
miṁchina nī kām̐gi liṭṭĕ mĕchchagunna dānanā
iṁchuga paravaśhamai yiṁduge kāga
aṁchĕla śhrīveṁkaḍeśha ādariṁchi kūḍidivi
maṁchidānam̐ gānā vŏkkamām̐ṭa kiṁte kāga