Emaninaam danado ne neduraadenaa

ఏమనినాఁ దనతో నే నెదురాడేనా
Language

(॥పల్లవి॥)
ఏమనినాఁ దనతో నే నెదురాడేనా
వేమారుఁ దన కతలు వెలఇంచేఁగాక

(॥ఏమ॥)
చెప్పితిఁ గదవే తన చేఁతలెల్లా నీతోను
చొప్పగా మేన గురుతు చూపితిగదే
తప్పక వద్దిచెలులఁదారుకాణించితిగదే
అప్పటి నింకానేల ఆనవెట్టుకొనీనె

(॥ఏమ॥)
పట్టిఇచ్చితిఁగదవే భామ కంపినలేకలు
పెట్టిన సొమ్ములఁ దెలిపితిఁ గదవే
ఇట్టె చుట్టిరికము లేరుపరచితిగదే
నెట్టనఁ దగవు లెంత నెరప వచ్చీనే

(॥ఏమ॥)
పందే లాపెతో నాడఁగా పడితాళించితిఁ గదే
చిందినకప్పర మొప్పించితిఁ గదవే
విందువలె వచ్చి శ్రీవేంకటేశుఁడు నన్నేలె
సందడిలోఁ దానెంత చందాలు సేసీనే

(||pallavi||)
emaninām̐ danado ne nĕdurāḍenā
vemārum̐ dana kadalu vĕla̮iṁchem̐gāga

(||ema||)
sĕppidim̐ gadave tana sem̐talĕllā nīdonu
sŏppagā mena gurudu sūbidigade
tappaga vaddisĕlulam̐dārugāṇiṁchidigade
appaḍi niṁkānela ānavĕṭṭugŏnīnĕ

(||ema||)
paṭṭiichchidim̐gadave bhāma kaṁpinalegalu
pĕṭṭina sŏmmulam̐ dĕlibidim̐ gadave
iṭṭĕ suṭṭirigamu lerubarasidigade
nĕṭṭanam̐ dagavu lĕṁta nĕraba vachchīne

(||ema||)
paṁde lābĕdo nāḍam̐gā paḍidāḽiṁchidim̐ gade
siṁdinagappara mŏppiṁchidim̐ gadave
viṁduvalĕ vachchi śhrīveṁkaḍeśhum̐ḍu nannelĕ
saṁdaḍilom̐ dānĕṁta saṁdālu sesīne