ఏమని యాడుకొందురో యెప్పటి తన సతులు
(॥పల్లవి॥)
ఏమని యాడుకొందురో యెప్పటి తన సతులు
వేమరు నీ పనులకు వింతదాననా
(॥ఏమ॥)
తముల ముమియఁగాను తానేమి చుచీనే
చెమరించఁగానేల చేత నంటీనే
అమరకున్నఁ బయ్యద అదేల చక్కఁబెట్టీనే
తమకించ నే నంతటిదాననా
(॥ఏమ॥)
పువ్వులు ముడుచుకొఁగా పొంచి చేయేల చాఁచీనే
నవ్వఁగా నేమిటికి సన్నలు సేసీనే
పవ్వళించితినంటాను పయినేల వొరగీనే
తవ్వేవు రతుల కంతటిదానవా
(॥ఏమ॥)
సురటి విసరుకోఁగా సొరిది కేల వచ్చీనే
కరఁగితే దానేల కాఁగిలించీనె
యిరవై శ్రీవేంకటేశు డేలె నిట్టె నన్నుఁ దానె
తరవాతపనుల కంతదటిదాననా
(||pallavi||)
emani yāḍugŏṁduro yĕppaḍi tana sadulu
vemaru nī panulagu viṁtadānanā
(||ema||)
tamula mumiyam̐gānu tānemi susīne
sĕmariṁcham̐gānela seda naṁṭīne
amaragunnam̐ bayyada adela sakkam̐bĕṭṭīne
tamagiṁcha ne naṁtaḍidānanā
(||ema||)
puvvulu muḍusugŏm̐gā pŏṁchi seyela sām̐sīne
navvam̐gā nemiḍigi sannalu sesīne
pavvaḽiṁchidinaṁṭānu payinela vŏragīne
tavvevu radula kaṁtaḍidānavā
(||ema||)
suraḍi visarugom̐gā sŏridi kela vachchīne
karam̐gide dānela kām̐giliṁchīnĕ
yiravai śhrīveṁkaḍeśhu ḍelĕ niṭṭĕ nannum̐ dānĕ
taravādabanula kaṁtadaḍidānanā