Emani vuttaramichchee nimkam daa naagu

ఏమని వుత్తరమిచ్చీ నిఁకఁ దా నాకు
Language

(॥పల్లవి॥)
ఏమని వుత్తరమిచ్చీ నిఁకఁ దా నాకు
వేమారు సారె సారె వెడమాటలేఁటికే

(॥ఏమ॥)
అద్దరిపాటు రమణుఁడాకెయింటఁ బానుపుపై
నిద్దరించంగా జూచి నే నాఁపలేక
వొద్దఁబండి కుచముల నొత్తితి నాతనివీఁపు
అద్దివో న న్నా కెనంటాఁ నాపెపేరఁ బిలిచె

(॥ఏమ॥)
తక్కక ఆకెమేడలో దాఁగిలిముచ్చులాడఁగా
గక్కన మోవి యాని గంటిసేయఁగా
పెక్కుమారు లానెలఁతపేరఁ దిట్టె నన్ను నేఁడు
తక్కులేమీ నెఱఁగఁడు తన్ను నేమనెందునే

(॥ఏమ॥)
దొంతులై ఆకెయుఁ దాను దొమ్మిరతి సలుపఁగా
కాంతఁగన కాఁగిలించి కళలంటఁగా
అంతలో శ్రీవేంకటేశుఁ డాకెనంటా నన్నుఁ గూడె
యెంతకెంత అవసర మిపుడు దాఁ గనెనే

(||pallavi||)
emani vuttaramichchī nim̐kam̐ dā nāgu
vemāru sārĕ sārĕ vĕḍamāḍalem̐ṭige

(||ema||)
addaribāḍu ramaṇum̐ḍāgĕyiṁṭam̐ bānububai
niddariṁchaṁgā jūsi ne nām̐palega
vŏddam̐baṁḍi kusamula nŏttidi nādanivīm̐pu
addivo na nnā kĕnaṁṭām̐ nābĕberam̐ bilisĕ

(||ema||)
takkaga āgĕmeḍalo dām̐gilimuchchulāḍam̐gā
gakkana movi yāni gaṁṭiseyam̐gā
pĕkkumāru lānĕlam̐taberam̐ diṭṭĕ nannu nem̐ḍu
takkulemī nĕṟam̐gam̐ḍu tannu nemanĕṁdune

(||ema||)
dŏṁtulai āgĕyum̐ dānu dŏmmiradi salubam̐gā
kāṁtam̐gana kām̐giliṁchi kaḽalaṁṭam̐gā
aṁtalo śhrīveṁkaḍeśhum̐ ḍāgĕnaṁṭā nannum̐ gūḍĕ
yĕṁtagĕṁta avasara mibuḍu dām̐ ganĕne