Emani vodambarase vettu sesevo kaani

ఏమని వొడఁబరచే వెట్టు సేసేవో కాని
Language

(॥పల్లవి॥)
ఏమని వొడఁబరచే వెట్టు సేసేవో కాని
సోమారి వలపులలో సుడిగొనున్నాఁడు

(॥ఏమ॥)
దంతపు వెన్నెలలతోఁ దగ నీవు మాటలాడఁ
గొంతపు నీ చూపులైతేఁ గొచ్చిపారీని
యింతలో నీ చక్కఁదన మిటు దారామోనఁ జూసె
పంతపు నీ రమణుఁడు భ్రమసి వున్నాఁడు

(॥ఏమ॥)
సెలవి నవ్వుల నీవే సేమంతులు చల్లఁగాను
మొలకచన్నులు పైపై మొనలెత్తీని
మెలువు నీసొమ్ములెల్లా మృదువులో వాఁడిచూసె
వెలిసేమీననలేక వెరగైయున్నాఁడు

(॥ఏమ॥)
కందువకాఁగిట నీవు కలసి మొలఁగఁ గాను
ముందరనే నీ తురుము ముడి వీడీని
చెంది పురుషోత్తమాన శ్రీవేంకటేశ్వరుఁడు
అందునిందు వచ్చి కూడి యులసివున్నాఁడు

(||pallavi||)
emani vŏḍam̐barase vĕṭṭu sesevo kāni
somāri valabulalo suḍigŏnunnām̐ḍu

(||ema||)
daṁtabu vĕnnĕlaladom̐ daga nīvu māḍalāḍam̐
gŏṁtabu nī sūbulaidem̐ gŏchchibārīni
yiṁtalo nī sakkam̐dana miḍu dārāmonam̐ jūsĕ
paṁtabu nī ramaṇum̐ḍu bhramasi vunnām̐ḍu

(||ema||)
sĕlavi navvula nīve semaṁtulu sallam̐gānu
mŏlagasannulu paibai mŏnalĕttīni
mĕluvu nīsŏmmulĕllā mṛduvulo vām̐ḍisūsĕ
vĕlisemīnanalega vĕragaiyunnām̐ḍu

(||ema||)
kaṁduvagām̐giḍa nīvu kalasi mŏlam̐gam̐ gānu
muṁdarane nī turumu muḍi vīḍīni
sĕṁdi puruṣhottamāna śhrīveṁkaḍeśhvarum̐ḍu
aṁduniṁdu vachchi kūḍi yulasivunnām̐ḍu