Emani vinnavimchenu idivo neegu

ఏమని విన్నవించేను ఇదివో నీకు
Language

(॥పల్లవి॥)
ఏమని విన్నవించేను ఇదివో నీకు
ఆమని వలపులను ఆరడైతి నేను

(॥॥)
నవ్వులు నీవు నవ్వఁ గా నమ్మివుంటివి
పువ్వులను వోయఁగానుఁ బోఁదైఁ తిని
యివ్వల నీదయ నాపై నెట్టున్నదో
నివ్వటిల్లుఁ గోర్కులకు నెలవైతి నేను

(॥॥)
పైపైఁ జేయివేయఁ గాను భ్రమసితిని
తీపుమోవి చూపఁ గా నందితి ముదము
యేపున నిన్నెటువలె నేలేవో నీవు
మాపురేపు నీసుద్దులే మరిగితి నేను

(॥॥)
పక్కన నీవు గూడఁగా బతికితిని
చెక్కునొక్కి వేఁడుకోఁ గాఁ జెలఁగితిని
యిక్కువ శ్రీ వేంకటేశ యెట్టు మెచ్చేవో
తక్కక నీమన్ననల దాకొంటి నేను

(||pallavi||)
emani vinnaviṁchenu idivo nīgu
āmani valabulanu āraḍaidi nenu

(||||)
navvulu nīvu navvam̐ gā nammivuṁṭivi
puvvulanu voyam̐gānum̐ bom̐daim̐ tini
yivvala nīdaya nābai nĕṭṭunnado
nivvaḍillum̐ gorgulagu nĕlavaidi nenu

(||||)
paibaim̐ jeyiveyam̐ gānu bhramasidini
tībumovi sūbam̐ gā naṁdidi mudamu
yebuna ninnĕḍuvalĕ nelevo nīvu
māburebu nīsuddule marigidi nenu

(||||)
pakkana nīvu gūḍam̐gā badigidini
sĕkkunŏkki vem̐ḍugom̐ gām̐ jĕlam̐gidini
yikkuva śhrī veṁkaḍeśha yĕṭṭu mĕchchevo
takkaga nīmannanala dāgŏṁṭi nenu