ఏమని విన్నవించేనే యిఁకఁ దనతో నేను
(॥పల్లవి॥)
ఏమని విన్నవించేనే యిఁకఁ దనతో నేను
నేమాన వచ్చెఁగా నన్నుఁ జిత్తగింపు మనవే
(॥॥)
మక్కువఁ దనపై నామతి తలపోఁతలకు
చెక్కుపై నిడుకొన్ననాచెయ్యే సాక్షి
అక్కరతో విరహవుటసురుసురులకును
ముక్కునఁ బెట్టిన నాముత్తెమే సాక్షి
(॥॥)
తన్నుఁ బాసి నిద్రలేక తగ వేగించినందుకు
కన్నుల నుండిన యట్టి కాటుకే సాక్షి
వున్నతపుఁ గోరికల నుమ్మగిలినందుకు
పన్నీటి చెమటల పయ్యదే సాక్షి
(॥॥)
నిబ్బరపుఁ బరవుపై నేఁ బోరలాడినందుకు
గుబ్బల గందపు బేంట్ల గురుఁతులే సాక్షి
పబ్బి యలమేల్మంగపతి శ్రీవేంకటేశుఁడు
ఆబ్బురాన నన్నుఁ గూడేయానందమే సాక్షి
(||pallavi||)
emani vinnaviṁchene yim̐kam̐ danado nenu
nemāna vachchĕm̐gā nannum̐ jittagiṁpu manave
(||||)
makkuvam̐ danabai nāmadi talabom̐talagu
sĕkkubai niḍugŏnnanāsĕyye sākṣhi
akkarado virahavuḍasurusurulagunu
mukkunam̐ bĕṭṭina nāmuttĕme sākṣhi
(||||)
tannum̐ bāsi nidralega taga vegiṁchinaṁdugu
kannula nuṁḍina yaṭṭi kāḍuge sākṣhi
vunnadabum̐ gorigala nummagilinaṁdugu
pannīḍi sĕmaḍala payyade sākṣhi
(||||)
nibbarabum̐ baravubai nem̐ boralāḍinaṁdugu
gubbala gaṁdabu beṁṭla gurum̐tule sākṣhi
pabbi yalamelmaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu
ābburāna nannum̐ gūḍeyānaṁdame sākṣhi