Emani vinnavimchemu yemdaamkaa needonu

ఏమని విన్నవించేము యెందాఁకా నీతోను
Language

(॥పల్లవి॥)
ఏమని విన్నవించేము యెందాఁకా నీతోను
కామిని సుద్దులు చెప్పఁ గతలాయ నీకును

(॥ఏమ॥)
చప్పరములోన నుండి సారె సారె నుస్సురంటా
కప్పురములే యడుగుఁ గాంతలను
ముప్పిరినంతటిలోన ముంగిట వచ్చి నిలిచి
రెప్పలు వేయక చూచు వొప్పుగునీరాకకు

(॥ఏమ॥)
గందము వూసుకొని కడునుడు కెత్తెనంటా
అందుకొనుఁ బన్నీరు అప్పుడప్పుడే
విందుగాఁగ మోవితేనె వెస నీకు మీఁదెత్తుక
చెంది ప్రియాలు చెప్పెంపు చెలుల నీవద్దికి

(॥ఏమ॥)
పరగఁ బరపుమీఁద పైకొనఁగా నిన్నుఁ గూడె
సిరులుమీరఁగ నిట్టె శ్రీవేంకటేశ
సరసపుమాటలలో సన్నలు సేసి సేసి
పెరరెంచుఁ దమకము పెనఁగుచు నీకు

(||pallavi||)
emani vinnaviṁchemu yĕṁdām̐kā nīdonu
kāmini suddulu sĕppam̐ gadalāya nīgunu

(||ema||)
sapparamulona nuṁḍi sārĕ sārĕ nussuraṁṭā
kappuramule yaḍugum̐ gāṁtalanu
muppirinaṁtaḍilona muṁgiḍa vachchi nilisi
rĕppalu veyaga sūsu vŏppugunīrāgagu

(||ema||)
gaṁdamu vūsugŏni kaḍunuḍu kĕttĕnaṁṭā
aṁdugŏnum̐ bannīru appuḍappuḍe
viṁdugām̐ga movidenĕ vĕsa nīgu mīm̐dĕttuga
sĕṁdi priyālu sĕppĕṁpu sĕlula nīvaddigi

(||ema||)
paragam̐ barabumīm̐da paigŏnam̐gā ninnum̐ gūḍĕ
sirulumīram̐ga niṭṭĕ śhrīveṁkaḍeśha
sarasabumāḍalalo sannalu sesi sesi
pĕrarĕṁchum̐ damagamu pĕnam̐gusu nīgu