ఏమని వర్ణించునొకో ఇఁకఁ బురాణములెల్ల
(॥పల్లవి॥)
ఏమని వర్ణించునొకో ఇఁకఁ బురాణములెల్ల
వేమారుఁ గొత్తలాయ విశ్వలోకపతికి
(॥ఏమ॥)
పాలజలనిధిలోన పలుమారుఁ దేలఁగాను
నీలవర్ణమెల్లఁ చేయి నిండుఁ దెలుపైనట్టు
మేలిమి కప్పురకాపు మేన నిండఁ నించఁగాను
పోలికె వేరొక్కటాయ పురుషోత్తమునికి
(॥ఏమ॥)
వేడుకఁ గాళిందిలోన వేమారు నీఁదఁగాను
ఆడనే కమ్మర నలుపైనట్టు
తోడనే తట్టుపుణుఁగు తొప్పఁదోగ నించఁగాను
జాడ వేరొక్కటాయ సర్వేశ్వరునికి
(॥ఏమ॥)
అలమేలుమంగ నురమందునే నిలుపఁగాను
అలరి బంగారువర్ణమైనట్టు
నలుగడ సొమ్ములతో నానావర్ణమలు
నిలిచె శ్రీవేంకటనిలయమూరితికి
(||pallavi||)
emani varṇiṁchunŏgo im̐kam̐ burāṇamulĕlla
vemārum̐ gŏttalāya viśhvalogabadigi
(||ema||)
pālajalanidhilona palumārum̐ delam̐gānu
nīlavarṇamĕllam̐ seyi niṁḍum̐ dĕlubainaṭṭu
melimi kappuragābu mena niṁḍam̐ niṁcham̐gānu
poligĕ verŏkkaḍāya puruṣhottamunigi
(||ema||)
veḍugam̐ gāḽiṁdilona vemāru nīm̐dam̐gānu
āḍane kammara nalubainaṭṭu
toḍane taṭṭubuṇum̐gu tŏppam̐doga niṁcham̐gānu
jāḍa verŏkkaḍāya sarveśhvarunigi
(||ema||)
alamelumaṁga nuramaṁdune nilubam̐gānu
alari baṁgāruvarṇamainaṭṭu
nalugaḍa sŏmmulado nānāvarṇamalu
nilisĕ śhrīveṁkaḍanilayamūridigi