Emani seppudurayya ittidi naa kaampuramu

ఏమని చెప్పుదురయ్య ఇట్టిది నా కాఁపురము
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పుదురయ్య ఇట్టిది నా కాఁపురము
నీ మేలులోనిదాన నేఁ జుమ్మీ రమణుఁడ

(॥ఏమ॥)
నిలిచి యొక్కకమారు నీ వాదరించినదెల్లా
తలఁచు కొంటేను చిత్తము గరఁగు
యెలిమిఁ బొద్దు వోకకు యెడనెడ నీగుణాలు
చెలులచే వింటేను చిప్పిలి సంతోసము

(॥ఏమ॥)
చేముంచి నీ వేకతానఁ జేసిన గురుతులెల్లా
నామేనఁ జూచుకొంటే నవ్వు వచ్చును
కామించి నీవంపినట్టి కస్తూరి నేఁ బూసుకొంటే
ప్రేమపుఁ దమకములు పెడరేఁగును

(॥ఏమ॥)
అద్దరిపాటుగాను నా యండకు నీవు వచ్చితే
కొద్దిమీరిన వేడుక గుదిగొనును
వొద్దికై శ్రీ వేంకటేశ వొగి నన్నుఁ గూడితివి
చద్దివేఁడి రతు లిట్టె సమకొనును

(||pallavi||)
emani sĕppudurayya iṭṭidi nā kām̐puramu
nī melulonidāna nem̐ jummī ramaṇum̐ḍa

(||ema||)
nilisi yŏkkagamāru nī vādariṁchinadĕllā
talam̐su kŏṁṭenu sittamu garam̐gu
yĕlimim̐ bŏddu vogagu yĕḍanĕḍa nīguṇālu
sĕlulase viṁṭenu sippili saṁtosamu

(||ema||)
semuṁchi nī vegadānam̐ jesina gurudulĕllā
nāmenam̐ jūsugŏṁṭe navvu vachchunu
kāmiṁchi nīvaṁpinaṭṭi kastūri nem̐ būsugŏṁṭe
premabum̐ damagamulu pĕḍarem̐gunu

(||ema||)
addaribāḍugānu nā yaṁḍagu nīvu vachchide
kŏddimīrina veḍuga gudigŏnunu
vŏddigai śhrī veṁkaḍeśha vŏgi nannum̐ gūḍidivi
saddivem̐ḍi radu liṭṭĕ samagŏnunu