Emani seppudune yittidi naa yaam(yaam?)dolamu

ఏమని చెప్పుదునే యిట్టిది నా యాఁ(యాం?)దోళము
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పుదునే యిట్టిది నా యాఁ(యాం?)దోళము
కామించాతని చిత్త మేగతి నున్నదో

(॥ఏమ॥)
మాటలాడినట్టుండు మరి నవ్వినట్టుండు
తాటించి విభునిరూవు దలఁచుకొంటే
గాఁటాన వచ్చినట్లుండు కరము చాఁచినట్లుండు
పాటించాతని సుద్దులు పలుమారు వింటేను

(॥ఏమ॥)
సరుసఁ గూచున్నట్లుండు సారెఁ జెనకినట్లుండు
ఇరవై తనమన్న లెంచుకొంటేను
విరుల వేసినిట్లుడు వేఁడుకొని నట్లుఁడు
గరిమఁ దనచేఁతలు గనుఁగొంటేను

(॥ఏమ॥)
చెక్కులు నొక్కినట్లుండు చేరికూడినట్లుండు
నెక్కొని పానుపుమీఁద నెలకొంటేను
ఇక్కడ శ్రీవేంకటేశుఁ డింతలో వచ్చి నన్నేలె
దక్కె నా కితఁడు నేఁడు తానే గతి యంటేను

(||pallavi||)
emani sĕppudune yiṭṭidi nā yām̐(yāṁ?)doḽamu
kāmiṁchādani sitta megadi nunnado

(||ema||)
māḍalāḍinaṭṭuṁḍu mari navvinaṭṭuṁḍu
tāḍiṁchi vibhunirūvu dalam̐sugŏṁṭe
gām̐ṭāna vachchinaṭluṁḍu karamu sām̐sinaṭluṁḍu
pāḍiṁchādani suddulu palumāru viṁṭenu

(||ema||)
sarusam̐ gūsunnaṭluṁḍu sārĕm̐ jĕnaginaṭluṁḍu
iravai tanamanna lĕṁchugŏṁṭenu
virula vesiniṭluḍu vem̐ḍugŏni naṭlum̐ḍu
garimam̐ danasem̐talu ganum̐gŏṁṭenu

(||ema||)
sĕkkulu nŏkkinaṭluṁḍu serigūḍinaṭluṁḍu
nĕkkŏni pānubumīm̐da nĕlagŏṁṭenu
ikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo vachchi nannelĕ
dakkĕ nā kidam̐ḍu nem̐ḍu tāne gadi yaṁṭenu