Emani seppudune yimtulaala meedonu

ఏమని చెప్పుదునే యింతులాల మీతోను
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పుదునే యింతులాల మీతోను
కామించి యాతఁడే నన్నుఁ గరుణించీఁగాక

(॥ఏమ॥)
కొమరెవలపు లోలో గుబ్బతిలుకొంటాను
తమకమే రేఁచుఁగాని తనియఁగనియ్యదు
తిమిరేటితలపోఁత తీగెలువారుకొంటా
మమతలే పెంచుఁగాని మఱవఁగనియ్యదు

(॥ఏమ॥)
సేసుకొన్నపొందులు చేఁగలు దేరుకొంటా
అసలే పుట్టించుఁగాని అలపారనియ్యదు
సేసవెట్టినవేడుక సిగ్గువాపుకొంటాను
వాసిఁ బెనఁగించుఁగాని వదలఁగనియ్యదు

(॥ఏమ॥)
పాయనిచుట్టరికము పచ్చిదేరుకొంటాను
కాయము చొక్కించుఁగాని గద్దించనియ్యదు
పాయపుటల మేల్ మంగపతి శ్రీవేంకటేశుఁడు
యీయెడ నన్నేలెఁ దగు లెడయఁగనియ్యదు

(||pallavi||)
emani sĕppudune yiṁtulāla mīdonu
kāmiṁchi yādam̐ḍe nannum̐ garuṇiṁchīm̐gāga

(||ema||)
kŏmarĕvalabu lolo gubbadilugŏṁṭānu
tamagame rem̐sum̐gāni taniyam̐ganiyyadu
timireḍidalabom̐ta tīgĕluvārugŏṁṭā
mamadale pĕṁchum̐gāni maṟavam̐ganiyyadu

(||ema||)
sesugŏnnabŏṁdulu sem̐galu derugŏṁṭā
asale puṭṭiṁchum̐gāni alabāraniyyadu
sesavĕṭṭinaveḍuga sigguvābugŏṁṭānu
vāsim̐ bĕnam̐giṁchum̐gāni vadalam̐ganiyyadu

(||ema||)
pāyanisuṭṭarigamu pachchiderugŏṁṭānu
kāyamu sŏkkiṁchum̐gāni gaddiṁchaniyyadu
pāyabuḍala mel maṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu
yīyĕḍa nannelĕm̐ dagu lĕḍayam̐ganiyyadu