Emani seppudune yidivo naa valabu

ఏమని చెప్పుదునే యిదివో నా వలపు
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పుదునే యిదివో నా వలపు
దోమటి వెూవితేనెలఁ దొట్టుకొనె వలపు

(॥॥)
తలపోఁతలచేత దట్టమవును వలపు
సొలపులు నెరపితేఁ జుట్టుకొను వలపు
పలుకులఁ గొసరితేఁ బదనెక్కు వలపు
నెలకొని నవ్వితేను నిలుకడౌ వలపు

(॥॥)
చెనకులు గనమైతే చిమ్మిరేఁగు వలపు
తనువుసోఁకులను తగులౌను వలపు
పెనఁగఁగాఁ బెనఁగఁగా బెచ్చురేఁగు వలపు
మనసురా మెలఁ గితే మక్కళించు వలపు

(॥॥)
తప్పక చూచితేనే తలకొను వలపు
ముప్పిరివినయముల ముంచుకొను వలపు
అప్పఁడు శ్రీవేంకటేశుఁ డంతలోనె నన్నుఁ గూడె
చెప్పరానిరతులను చెట్టుకట్టు వలపు

(||pallavi||)
emani sĕppudune yidivo nā valabu
domaḍi vĕూvidenĕlam̐ dŏṭṭugŏnĕ valabu

(||||)
talabom̐talaseda daṭṭamavunu valabu
sŏlabulu nĕrabidem̐ juṭṭugŏnu valabu
palugulam̐ gŏsaridem̐ badanĕkku valabu
nĕlagŏni navvidenu nilugaḍau valabu

(||||)
sĕnagulu ganamaide simmirem̐gu valabu
tanuvusom̐kulanu tagulaunu valabu
pĕnam̐gam̐gām̐ bĕnam̐gam̐gā bĕchchurem̐gu valabu
manasurā mĕlam̐ gide makkaḽiṁchu valabu

(||||)
tappaga sūsidene talagŏnu valabu
muppirivinayamula muṁchugŏnu valabu
appam̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ nannum̐ gūḍĕ
sĕpparāniradulanu sĕṭṭugaṭṭu valabu