ఏమని చెప్పేము నేము ఇందుకు మారుత్తరము
(॥పల్లవి॥)
ఏమని చెప్పేము నేము ఇందుకు మారుత్తరము
కామించి నీకే తెలుసుఁగాక యీ కతలు
(॥ఏమ॥)
చిక్కనినవ్వులు నవ్వెఁ జెలియ నీమోము చూచి
వక్కణడిగేవు చెప్పవచ్చునా యిందు
మొక్కు మొక్కెఁ జేతులెత్తిముందరనే నన్నుఁ గని
లెక్క లెంచుకోనే విది లెస్సాయనయ్యా
(॥ఏమ॥)
కడలేనివినయాలు కాంత నీకుఁ జేసీతేను
వొడివట్టే వందుఁ బెట్ట నొనగూడునా
వడిగా నీమీఁదట వలపులు చల్లితేను
ముడిచేవు కొంగునను కడుజాణవయ్యా
(॥ఏమ॥)
అలమేలుమంగ నీతో నట్టె మాటలాడఁ గాను
కొలచేవు కుంచానఁ జిక్కునా ఇవి
యెలమి శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
వెలవెట్టేవు చన్నులు వేడుకకాఁడవయ్యా
(||pallavi||)
emani sĕppemu nemu iṁdugu māruttaramu
kāmiṁchi nīge tĕlusum̐gāga yī kadalu
(||ema||)
sikkaninavvulu navvĕm̐ jĕliya nīmomu sūsi
vakkaṇaḍigevu sĕppavachchunā yiṁdu
mŏkku mŏkkĕm̐ jedulĕttimuṁdarane nannum̐ gani
lĕkka lĕṁchugone vidi lĕssāyanayyā
(||ema||)
kaḍalenivinayālu kāṁta nīgum̐ jesīdenu
vŏḍivaṭṭe vaṁdum̐ bĕṭṭa nŏnagūḍunā
vaḍigā nīmīm̐daḍa valabulu sallidenu
muḍisevu kŏṁgunanu kaḍujāṇavayyā
(||ema||)
alamelumaṁga nīdo naṭṭĕ māḍalāḍam̐ gānu
kŏlasevu kuṁchānam̐ jikkunā ivi
yĕlami śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
vĕlavĕṭṭevu sannulu veḍugagām̐ḍavayyā