Emani seppamgavachchu nimtigi neesamdamulu

ఏమని చెప్పఁగవచ్చు నింతికి నీచందములు
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పఁగవచ్చు నింతికి నీచందములు
ప్రేమము నీచిత్తమునఁ బెట్టుకొనవయ్యా

(॥ఏమ॥)
చెలియకు నీ విప్పుడు చేరి మోము చూపితేను
కలువలకును శశిఁగనినట్టాయ
వలచి నీవు వద్దికి వచ్చితే పవనమునకు
యెలమి వసంతుఁడు యేతెంచినట్లాయ

(॥ఏమ॥)
కోమలికి నీవింతలో కోరి పొందుసేసితేను
తామరలకు రవి నేస్తమైనట్టాయ
కామించి నీ విట్టె కాఁగిలించుకొంటేను
గోమునఁ గొండలపై మేఘుఁడు వాలినట్టాయ

(॥ఏమ॥)
నెలఁతపై నీవు చూపు నిల్పితే జవ్వనసీమ
వొలసి మరునిటెక్కే లుంచినట్లాయ
అలమేల్ మంగఁ గూడితి వదె శ్రీవేంకటేశ్వర
నెలవై బొందిఁ బ్రాణుఁడు నిలిచినట్లాయ

(||pallavi||)
emani sĕppam̐gavachchu niṁtigi nīsaṁdamulu
premamu nīsittamunam̐ bĕṭṭugŏnavayyā

(||ema||)
sĕliyagu nī vippuḍu seri momu sūbidenu
kaluvalagunu śhaśhim̐ganinaṭṭāya
valasi nīvu vaddigi vachchide pavanamunagu
yĕlami vasaṁtum̐ḍu yedĕṁchinaṭlāya

(||ema||)
komaligi nīviṁtalo kori pŏṁdusesidenu
tāmaralagu ravi nestamainaṭṭāya
kāmiṁchi nī viṭṭĕ kām̐giliṁchugŏṁṭenu
gomunam̐ gŏṁḍalabai meghum̐ḍu vālinaṭṭāya

(||ema||)
nĕlam̐tabai nīvu sūbu nilbide javvanasīma
vŏlasi maruniḍĕkke luṁchinaṭlāya
alamel maṁgam̐ gūḍidi vadĕ śhrīveṁkaḍeśhvara
nĕlavai bŏṁdim̐ brāṇum̐ḍu nilisinaṭlāya