Emani seppamgavachchu niddari jaanadanaalu

ఏమని చెప్పఁగవచ్చు నిద్దరి జాణతనాలు
Language

(॥పల్లవి॥)
ఏమని చెప్పఁగవచ్చు నిద్దరి జాణతనాలు
కామించి చూడరే కడుఁగన్నుల పండుగలు

(॥॥)
యెదురుగొండలెక్కి ఇందిరా నౌభళేశుఁడు
మదము చెక్కిళ్ళఁ గార మాటలాడేరు
పొదిగొన్న వేడుకెంతో పూవులఁ దమలోఁ దాము
చెదరనియాసలతో సేసలు చల్లేరు

(॥॥)
రేఁగి రేఁగి భవనాశి రెండుదరులా నుండి
మాఁగినమోవులు చూపి మతిఁ జొక్కేరు
తోఁగి తోఁగి చూచుకొంటా తొడిఁబడి రతులకు
దాఁగని ముచ్చటలతో దమకించేరు

(॥॥)
సమదిష్టి నొండురులు సంగడివనాలనీడ
జమళి కాఁగిళ్లకు సమకూడేరు
ఆమర శ్రీ వేంకటాద్రి నందనిందూఁ దావుకొని
చెమటమేనులతోడ సెలవుల నవ్వేరు

(||pallavi||)
emani sĕppam̐gavachchu niddari jāṇadanālu
kāmiṁchi sūḍare kaḍum̐gannula paṁḍugalu

(||||)
yĕdurugŏṁḍalĕkki iṁdirā naubhaḽeśhum̐ḍu
madamu sĕkkiḽḽam̐ gāra māḍalāḍeru
pŏdigŏnna veḍugĕṁto pūvulam̐ damalom̐ dāmu
sĕdaraniyāsalado sesalu salleru

(||||)
rem̐gi rem̐gi bhavanāśhi rĕṁḍudarulā nuṁḍi
mām̐ginamovulu sūbi madim̐ jŏkkeru
tom̐gi tom̐gi sūsugŏṁṭā tŏḍim̐baḍi radulagu
dām̐gani muchchaḍalado damagiṁcheru

(||||)
samadiṣhṭi nŏṁḍurulu saṁgaḍivanālanīḍa
jamaḽi kām̐giḽlagu samagūḍeru
āmara śhrī veṁkaḍādri naṁdaniṁdūm̐ dāvugŏni
sĕmaḍamenuladoḍa sĕlavula navveru