ఏమని చెప్పదునే యివిగో తారుకాణలు
(॥పల్లవి॥)
ఏమని చెప్పదునే యివిగో తారుకాణలు
నీ మదిఁ దలఁచుకోవే నెలఁత నామాఁటలు
(॥ఏమ॥)
కన్నులఁ జూచిన చూపు కడు నాసలు వుట్టంచు
విన్న వినుకులు మరి వేడుక రేఁచు
పన్నిన యెడమాఁటలు భావములు గరఁగించు
యెన్నిలేవు మరుతంత్రా లెంచి చూచుకొంటేను
(॥ఏమ॥)
తలఁచిన తలఁపులు తమకము లుప్పతిల్లించు
సెలవి నవ్విననవ్వు చెనకింపించు
వలచిన వలవులు వాడికలు వొడమించు
పిలిచి నెప్పఁగరావు పెండ్లి వేడుకలు
(॥ఏమ॥)
మంచముపై సరసాలు మర్మములు సోఁకించు
కంచముపొత్తు కాఁగిటఁ గలఇంచును
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డెనసె నిన్నింతలోనె
పెంచు జన్వనమదము ప్రియము లన్నియును
(||pallavi||)
emani sĕppadune yivigo tārugāṇalu
nī madim̐ dalam̐sugove nĕlam̐ta nāmām̐ṭalu
(||ema||)
kannulam̐ jūsina sūbu kaḍu nāsalu vuṭṭaṁchu
vinna vinugulu mari veḍuga rem̐su
pannina yĕḍamām̐ṭalu bhāvamulu garam̐giṁchu
yĕnnilevu marudaṁtrā lĕṁchi sūsugŏṁṭenu
(||ema||)
talam̐sina talam̐pulu tamagamu luppadilliṁchu
sĕlavi navvinanavvu sĕnagiṁpiṁchu
valasina valavulu vāḍigalu vŏḍamiṁchu
pilisi nĕppam̐garāvu pĕṁḍli veḍugalu
(||ema||)
maṁchamubai sarasālu marmamulu som̐kiṁchu
kaṁchamubŏttu kām̐giḍam̐ gala̮iṁchunu
yĕṁcham̐ga śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ ninniṁtalonĕ
pĕṁchu janvanamadamu priyamu lanniyunu