Emani pogadudu ninnibudu nenu

ఏమని పొగడుదు నిన్నిపుడు నేను
Language

(॥పల్లవి॥)
ఏమని పొగడుదు నిన్నిపుడు నేను
ఆముకొని మేలుదాన నైతి నేను

(॥ఏమని॥)
చల్లనిచూపుల నీవు సారె నన్నుఁ జూడఁగాను
వుల్లము గరఁగి చొక్కి వుందాన నేను
వెల్లవిరిగా నిట్టె వేడుకతో నవ్వఁగాను
చెల్లుబడిగా సంతోసించుకొంటి నేను

(॥ఏమని॥)
చక్కెరవంటిమాఁటలు చనవిచ్చి యాడఁగాను
అక్కరతోడుత ముదమందిత నేను
చొక్కుచు నన్నుఁ గదిసి చుట్టరికము సేయఁగా
మిక్కిలి నీ గుణాలకు మెచ్చుకొంటి నేను

(॥ఏమని॥)
మన్నన కాఁగిట నన్ను మరగించి కూడఁగాను
నన్నుఁ బాయకుందువని నమ్మితి నేను
యిన్నిటా నీవు శ్రీవేంకటేశ నీ యింట నుండఁగా
మున్ను మున్నుగా నీకు మొక్కితి నేను

(||pallavi||)
emani pŏgaḍudu ninnibuḍu nenu
āmugŏni meludāna naidi nenu

(||emani||)
sallanisūbula nīvu sārĕ nannum̐ jūḍam̐gānu
vullamu garam̐gi sŏkki vuṁdāna nenu
vĕllavirigā niṭṭĕ veḍugado navvam̐gānu
sĕllubaḍigā saṁtosiṁchugŏṁṭi nenu

(||emani||)
sakkĕravaṁṭimām̐ṭalu sanavichchi yāḍam̐gānu
akkaradoḍuda mudamaṁdida nenu
sŏkkusu nannum̐ gadisi suṭṭarigamu seyam̐gā
mikkili nī guṇālagu mĕchchugŏṁṭi nenu

(||emani||)
mannana kām̐giḍa nannu maragiṁchi kūḍam̐gānu
nannum̐ bāyaguṁduvani nammidi nenu
yinniḍā nīvu śhrīveṁkaḍeśha nī yiṁṭa nuṁḍam̐gā
munnu munnugā nīgu mŏkkidi nenu