ఏమని పొగడే మిదె నీ రమణిని
(॥పల్లవి॥)
ఏమని పొగడే మిదె నీ రమణిని
కోమలపు వయసు కోకిలవాణి
(॥ఏమ॥)
దొంతులువెట్టీఁ దోడనె వలపులు
కొంతపుచూపులకోమలి
సంతనసేసి సరసపుమాటల
వింతవేడుకల వెన్నెల పతిమ
(॥ఏమ॥)
విందులు చేసి వేమరు బ్రియముల
కందువనవ్వులకలకంటి
బిందెల నించీపెకగు సిగ్గులు
మందె మేళముల మదనునిశరము
(॥ఏమ॥)
పైరులు విత్తీ బలుతమకంబుల
మేరతో రతి నలమేల్మంగ
యీరీతి శ్రీవేంకటేశ నిన్నెనసె
సారపుగుణములజమళి మెఱుంగు
(||pallavi||)
emani pŏgaḍe midĕ nī ramaṇini
komalabu vayasu kogilavāṇi
(||ema||)
dŏṁtuluvĕṭṭīm̐ doḍanĕ valabulu
kŏṁtabusūbulagomali
saṁtanasesi sarasabumāḍala
viṁtaveḍugala vĕnnĕla padima
(||ema||)
viṁdulu sesi vemaru briyamula
kaṁduvanavvulagalagaṁṭi
biṁdĕla niṁchībĕgagu siggulu
maṁdĕ meḽamula madanuniśharamu
(||ema||)
pairulu vittī baludamagaṁbula
merado radi nalamelmaṁga
yīrīdi śhrīveṁkaḍeśha ninnĕnasĕ
sārabuguṇamulajamaḽi mĕṟuṁgu