Emani pogadavachchu nidivo needevulanu

ఏమని పొగడవచ్చు నిదివో నీదేవులను
Language

(॥పల్లవి॥)
ఏమని పొగడవచ్చు నిదివో నీదేవులను
ఆముకొని చక్కఁ జూడ నవధరించవయా

(॥ఏమ॥)
పొలఁతి చిరునవ్వులు పున్నమ వెన్నెలపొళ్లు
కలికి కనుచూపులు కన్నెలేళ్లు
మలయు మోవితేనెలు మరుని గుజ్జనగూళ్లు
అలరి యీకె పొందులు అవధరించవయా

(॥ఏమ॥)
గరిమనాడే మాటలు కప్పరపుమూట లు
పరగుఁ జక్కఁదనాలు బండిబాటలు
తెరమరఁగు సిగ్గు లొద్దికఁ బెట్టనికోటలు
అరిమురి వేడుకతో నవధరించవయా

(॥ఏమ॥)
చెక్కుమీఁది చెనకులు సింగారపుఁగళుకులు
నిక్కుఁగాంతులు పైఁడి వన్నె తళుకులు
ఇక్కువ శ్రీవేంకటేశ యీకెనిట్టె యేలితివి
అక్కజనపు సరసము లవధరించవయా

(||pallavi||)
emani pŏgaḍavachchu nidivo nīdevulanu
āmugŏni sakkam̐ jūḍa navadhariṁchavayā

(||ema||)
pŏlam̐ti sirunavvulu punnama vĕnnĕlabŏḽlu
kaligi kanusūbulu kannĕleḽlu
malayu movidenĕlu maruni gujjanagūḽlu
alari yīgĕ pŏṁdulu avadhariṁchavayā

(||ema||)
garimanāḍe māḍalu kapparabumūḍa lu
paragum̐ jakkam̐danālu baṁḍibāḍalu
tĕramaram̐gu siggu lŏddigam̐ bĕṭṭanigoḍalu
arimuri veḍugado navadhariṁchavayā

(||ema||)
sĕkkumīm̐di sĕnagulu siṁgārabum̐gaḽugulu
nikkum̐gāṁtulu paim̐ḍi vannĕ taḽugulu
ikkuva śhrīveṁkaḍeśha yīgĕniṭṭĕ yelidivi
akkajanabu sarasamu lavadhariṁchavayā