Emani pogadavachchu niddari nee nerubulu

ఏమని పొగడవచ్చు నిద్దరి నీ నేరుపులు
Language

(॥పల్లవి॥)
ఏమని పొగడవచ్చు నిద్దరి నీ నేరుపులు
ఆముకొన్న జాణతనా లమరు నీకెపుడు

(॥ఏమ॥)
నాఁటుకొన నీవాడే నయగారితముల -
మాఁటలకే వలచెను మగువ
చీటికి మాటికి నీవు చెందమ్మికన్నులఁ జాచే -
జూటరిచూపులకే చొక్కి మరిగినది

(॥ఏమ॥)
వువ్విళ్ళూర నేపొద్దా నీవుడివోని సెలవుల -
నవ్వులకే తగులాయ నలినాక్షి
రవ్వలుగాఁ జెక్కు నొక్కి రతివేళ నీవిచ్చేటి -
నివ్వటిల్లు మోవికే నిన్ను మరిగినది

(॥ఏమ॥)
హత్తి నీవు పాయలేక ఆసయిచ్చి లాలించే-
బత్తికే నీపాలఁ జిక్కె పడఁతి
యిత్తల శ్రీవేంకటేశ యాకె నిట్టే యేలితివి
కొత్తగు నీచేఁతలకే కూడి మెచ్చినది

(||pallavi||)
emani pŏgaḍavachchu niddari nī nerubulu
āmugŏnna jāṇadanā lamaru nīgĕbuḍu

(||ema||)
nām̐ṭugŏna nīvāḍe nayagāridamula -
mām̐ṭalage valasĕnu maguva
sīḍigi māḍigi nīvu sĕṁdammigannulam̐ jāse -
jūḍarisūbulage sŏkki mariginadi

(||ema||)
vuvviḽḽūra nebŏddā nīvuḍivoni sĕlavula -
navvulage tagulāya nalinākṣhi
ravvalugām̐ jĕkku nŏkki radiveḽa nīvichcheḍi -
nivvaḍillu movige ninnu mariginadi

(||ema||)
hatti nīvu pāyalega āsayichchi lāliṁche-
battige nībālam̐ jikkĕ paḍam̐ti
yittala śhrīveṁkaḍeśha yāgĕ niṭṭe yelidivi
kŏttagu nīsem̐talage kūḍi mĕchchinadi