ఏమని నుతింతునమ్మా యిట్టి నీ చక్కదనము
(॥పల్లవి॥)
ఏమని నుతింతునమ్మా యిట్టి నీ చక్కదనము
కాముని బలము లొక్క గాడిఁ గట్టితివౌనే
(॥ఏమ॥)
చెలి నీ కొప్పుననైతే చీఁకట్లు గమ్మీని
లలి సెలవినే వెన్నెలలు గాసీని
తళుఁకు గనుచూపుల తమ్మిరేకు లుప్పతిలీ
కలికి మోమునఁ జంద్రకళలు దేరీని
(॥ఏమ॥)
సతి నీ ముక్కున మంచి సంపెంగవాసన మించీ
తతి నీ యారునఁ దుమ్మిదలు మూఁగీని
యితవై నీ యడుగుల యేనుగుల చొప్పు దొట్టీ
కతకారి నడుము సింగముఁ బోలీని
(॥ఏమ॥)
వనిత నీ దంతముల వజ్రాలగని మించె
పనివూని మోవిఁ బుట్టె పచ్చి చిగురు
యెనసి శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్నుఁ బెండ్లాడఁగా
యినుమడి నీ సింగార మిటు నీకు నమరె
(||pallavi||)
emani nudiṁtunammā yiṭṭi nī sakkadanamu
kāmuni balamu lŏkka gāḍim̐ gaṭṭidivaune
(||ema||)
sĕli nī kŏppunanaide sīm̐kaṭlu gammīni
lali sĕlavine vĕnnĕlalu gāsīni
taḽum̐ku ganusūbula tammiregu luppadilī
kaligi momunam̐ jaṁdragaḽalu derīni
(||ema||)
sadi nī mukkuna maṁchi saṁpĕṁgavāsana miṁchī
tadi nī yārunam̐ dummidalu mūm̐gīni
yidavai nī yaḍugula yenugula sŏppu dŏṭṭī
kadagāri naḍumu siṁgamum̐ bolīni
(||ema||)
vanida nī daṁtamula vajrālagani miṁchĕ
panivūni movim̐ buṭṭĕ pachchi siguru
yĕnasi śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnum̐ bĕṁḍlāḍam̐gā
yinumaḍi nī siṁgāra miḍu nīgu namarĕ