Emanemu ninnu yegasakkeemda vinnidaa

ఏమనేము నిన్ను యెగసక్కీఁడ విన్నిటా
Language

(॥పల్లవి॥)
ఏమనేము నిన్ను యెగసక్కీఁడ విన్నిటా
ఆముకొన్న సటకాఁడ వౌదువయ్యా

(॥ఏమ॥)
మాటలాడవచ్చుఁగాక మనసులో కాఁతాళము
మూటగట్టవచ్చునా ముందరఁ దెచ్చి
సూటిచేసి నావలపు చూపుమనే వెదుటను
నీటు జాణతనాలు నేర్తువయ్యా నీవు

(॥ఏసు॥)
మొక్కు మొక్కవచ్చుఁ గాక మొగముపై నగవులు
మక్కు వేయ వచ్చునా మాపు దాఁకాను
అక్కరైన నావలపు లంగడిఁ బెట్టేవు నీవు
దిక్కులెరిఁగినయట్టి దిట్టవయ్యా నీవు

(॥ఏమ॥)
పొంది కూడవచ్చుఁ గాక పొంచి పొంచి మోవితేనె
బిందెఁ బోయవచ్చునా పెక్కుమాటలు(ల?)
ఇందరిలో శ్రీ వేంకటేశ నన్ను నేలితివి
కందు వెరిఁగిన యందఁగాఁడవయ్యా నీవు

(||pallavi||)
emanemu ninnu yĕgasakkīm̐ḍa vinniḍā
āmugŏnna saḍagām̐ḍa vauduvayyā

(||ema||)
māḍalāḍavachchum̐gāga manasulo kām̐tāḽamu
mūḍagaṭṭavachchunā muṁdaram̐ dĕchchi
sūḍisesi nāvalabu sūbumane vĕduḍanu
nīḍu jāṇadanālu nerduvayyā nīvu

(||esu||)
mŏkku mŏkkavachchum̐ gāga mŏgamubai nagavulu
makku veya vachchunā mābu dām̐kānu
akkaraina nāvalabu laṁgaḍim̐ bĕṭṭevu nīvu
dikkulĕrim̐ginayaṭṭi diṭṭavayyā nīvu

(||ema||)
pŏṁdi kūḍavachchum̐ gāga pŏṁchi pŏṁchi movidenĕ
biṁdĕm̐ boyavachchunā pĕkkumāḍalu(la?)
iṁdarilo śhrī veṁkaḍeśha nannu nelidivi
kaṁdu vĕrim̐gina yaṁdam̐gām̐ḍavayyā nīvu