Emanemu ninnu nimka nimtaa mele

ఏమనేము నిన్ను నిఁక నింతా మేలే
Language

(॥పల్లవి॥)
ఏమనేము నిన్ను నిఁక నింతా మేలే
వేమారుఁ జవిగొంటేను వేమే తీపు

(॥ఏమ॥)
యెమ్మెలకు నిజమేది యెడమాట గురియేది
ముమ్మారు నూఁకొంటే ములుకే వంగ
సమ్మతించుకొంటి నేను చనవిచ్చితివి నీవు
పమ్మి పేరఁబెట్టితేను పాలే పెరుగు

(॥ఏమ॥)
ఆసలకుఁ దనివేది ఆనలకు మితియేది
వేసర కడుగిడితే వెనకే ముందు
సేసవెట్టితిని నేను చేతికి లోనైతివి
చేసూటి ముదిరితేను చిగురే చేఁగ

(॥ఏమ॥)
కూటమికి అడ్డమేది కొసరులకు లెక్కేది
గాఁటమై గోర గీరితే కాలువే యేరు
యీటువెట్టి శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
నీటునఁ దెలుసుకొంటే నీవే నేను

(||pallavi||)
emanemu ninnu nim̐ka niṁtā mele
vemārum̐ javigŏṁṭenu veme tību

(||ema||)
yĕmmĕlagu nijamedi yĕḍamāḍa guriyedi
mummāru nūm̐kŏṁṭe muluge vaṁga
sammadiṁchugŏṁṭi nenu sanavichchidivi nīvu
pammi peram̐bĕṭṭidenu pāle pĕrugu

(||ema||)
āsalagum̐ danivedi ānalagu midiyedi
vesara kaḍugiḍide vĕnage muṁdu
sesavĕṭṭidini nenu sedigi lonaidivi
sesūḍi mudiridenu sigure sem̐ga

(||ema||)
kūḍamigi aḍḍamedi kŏsarulagu lĕkkedi
gām̐ṭamai gora gīride kāluve yeru
yīḍuvĕṭṭi śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
nīḍunam̐ dĕlusugŏṁṭe nīve nenu