Emamtunnadi ee gaalee

ఏమంటున్నది ఈ గాలీ
Year
Language

పల్లవి:

ఏమంటున్నది ఈ గాలీ...
ఎగిరే పైటను అడగాలీ..
ఏమంటున్నది ఈ గాలీ...
ఎగిరే పైటను అడగాలీ..
ఎగిరే పైటను ఏం చెయ్యాలి...
ఇంకో కొంగును ముడివెయ్యాలి...అహ..అహ..హ..
ఎగిరే పైటను ఏం చెయ్యాలి
ఇంకో కొంగును ముడివెయ్యాలి...

ఏమంటున్నది ఈ గాలీ
ఎగిరే పైటను అడగాలీ

చరణం 1:

పైటకు తెలుసు ...చాటున పొంగే ప్రాయం రెపరెపలూ...
గాలికి తెలుసూ... విరిసీ విరియని పూవుల ఘుమఘుమలూ..
ఊగే నడుమూ.. సాగే జడతో ..వేసెను పంతాలూ..ఊ..
నీలో వుడుకూ ..నాలో దుడుకూ... చేసెను నేస్తాలూ..చేసెను నేస్తాలూ..

ఏమంటున్నది ఈ గాలీ... ఎగిరే పైటను అడగాలీ...

చరణం 2:

మబ్బు మబ్బుతో ఏకమైనది.. సాయం సమయంలో...ఓ..
మనసు మనసుతో లీనమైనది.. మమతల మైకంలో...ఓ..
అల్లరి కళ్లూ ..వెన్నెల నవ్వూ ..పెట్టెను గిలిగింతా..
వెచ్చని వొడిలో ..ఇచ్చిన చోటున ..ఇమిడెను జగమంతా..ఇమిడెను జగమంతా ..

ఏమంటున్నది ఈ గాలీ... ఎగిరే పైటను అడగాలీ...
అహ..హ..అహా...లల..ల.లా.లా..

ఏమంటున్నది ఈ గాలీ... ఎగిరే పైటను అడగాలీ
ఎగిరే పైటను ఏం చెయ్యాలి... ఇంకో కొంగును ముడివెయ్యాలి

pallavi:

emaṁṭunnadi ī gālī...
ĕgire paiḍanu aḍagālī..
emaṁṭunnadi ī gālī...
ĕgire paiḍanu aḍagālī..
ĕgire paiḍanu eṁ sĕyyāli...
iṁko kŏṁgunu muḍivĕyyāli...aha..aha..ha..
ĕgire paiḍanu eṁ sĕyyāli
iṁko kŏṁgunu muḍivĕyyāli...

emaṁṭunnadi ī gālī
ĕgire paiḍanu aḍagālī

saraṇaṁ 1:

paiḍagu tĕlusu ...sāḍuna pŏṁge prāyaṁ rĕbarĕbalū...
gāligi tĕlusū... virisī viriyani pūvula ghumaghumalū..
ūge naḍumū.. sāge jaḍado ..vesĕnu paṁtālū..ū..
nīlo vuḍugū ..nālo duḍugū... sesĕnu nestālū..sesĕnu nestālū..

emaṁṭunnadi ī gālī... ĕgire paiḍanu aḍagālī...

saraṇaṁ 2:

mabbu mabbudo egamainadi.. sāyaṁ samayaṁlo...o..
manasu manasudo līnamainadi.. mamadala maigaṁlo...o..
allari kaḽlū ..vĕnnĕla navvū ..pĕṭṭĕnu giligiṁtā..
vĕchchani vŏḍilo ..ichchina soḍuna ..imiḍĕnu jagamaṁtā..imiḍĕnu jagamaṁtā ..

emaṁṭunnadi ī gālī... ĕgire paiḍanu aḍagālī...
aha..ha..ahā...lala..la.lā.lā..

emaṁṭunnadi ī gālī... ĕgire paiḍanu aḍagālī
ĕgire paiḍanu eṁ sĕyyāli... iṁko kŏṁgunu muḍivĕyyāli