Emammaa yee pamtamulu yennamdoo neṟamgamu

ఏమమ్మా యీ పంతములు యెన్నఁడూ నెఱఁగము
Language

(॥పల్లవి॥)
ఏమమ్మా యీ పంతములు యెన్నఁడూ నెఱఁగము
ప్రేమతో మీ ఇద్దరికిఁ బ్రియములే కలవి

(॥ఏమ॥)
మనసు లెనసి నీతో మంచిమాటలాడఁగాను
విని వూఁకొనఁగవద్దా విభునితోను
కొనగొంగు వట్టుకొని కూరిములు చల్లఁగాను
కని సంతోసించవద్దా కమ్మటి నీవు

(॥ఏమ॥)
చెలరేఁగి నీతోను చిరునవ్వు నవ్వఁగాను
తలయెత్తి చూడవద్దా తగిలి నీవు
మొలకచన్నులు సారె ముట్టిముట్టి పెనఁగఁగా
లలిఁ గాఁగిలించవద్దా లావున నీవు

(॥ఏమ॥)
వురముపై నిడుకొని వూడగాలు గొనఁగాను
సిరుల మెచ్చవద్దా శ్రీవేంకటేశు
అరుదుగాఁ గూడితివి అలమేలుమంగవు
సరసమాడఁగవద్దా సారె నిటువలెనే

(||pallavi||)
emammā yī paṁtamulu yĕnnam̐ḍū nĕṟam̐gamu
premado mī iddarigim̐ briyamule kalavi

(||ema||)
manasu lĕnasi nīdo maṁchimāḍalāḍam̐gānu
vini vūm̐kŏnam̐gavaddā vibhunidonu
kŏnagŏṁgu vaṭṭugŏni kūrimulu sallam̐gānu
kani saṁtosiṁchavaddā kammaḍi nīvu

(||ema||)
sĕlarem̐gi nīdonu sirunavvu navvam̐gānu
talayĕtti sūḍavaddā tagili nīvu
mŏlagasannulu sārĕ muṭṭimuṭṭi pĕnam̐gam̐gā
lalim̐ gām̐giliṁchavaddā lāvuna nīvu

(||ema||)
vuramubai niḍugŏni vūḍagālu gŏnam̐gānu
sirula mĕchchavaddā śhrīveṁkaḍeśhu
arudugām̐ gūḍidivi alamelumaṁgavu
sarasamāḍam̐gavaddā sārĕ niḍuvalĕne