Emamdu ne nimka yeedanidonu

ఏమందు నే నిఁక యీతనితోను
Language

(॥పల్లవి॥)
ఏమందు నే నిఁక యీతనితోను
కామించి నాకుఁగానే కాచుకవున్నాఁడే

(॥ఏమం॥)
పొట్టఁ బొరుగున నుండి పువ్వుల చెండున వేసి
చుట్టపు మాఁటలాడీ సోరణగండ్ల
యిట్టె సిగ్గుతోడ నే నివ్వలిమోమైతేను
పట్టి చమ్మనఁగోవుల పన్నీరు చిమ్మీనే

(॥ఏమం॥)
మునిముంగిటికి వచ్చి ముచ్చట నవ్వులు నవ్వి
తనుఁదానే పాటవాడీ తలపుదండ
పొనిగి గడె దెరచి బుద్దులు నేఁ జెప్పితేను
పనిగలవానివలె బాగా లిచ్చీనే

(॥ఎమం॥)
వుయ్యాలమంచ మెక్కి వూచుమని కాఁగిలించి
యియ్యెడఁ జెలఁగీ నట్టింటిలోనను
పయ్యాడి యలమేల్మంగపతి శ్రీవేంకటేశుఁడు
వొయ్యనే రతుల న న్నోలలారిచీనే

(||pallavi||)
emaṁdu ne nim̐ka yīdanidonu
kāmiṁchi nāgum̐gāne kāsugavunnām̐ḍe

(||emaṁ||)
pŏṭṭam̐ bŏruguna nuṁḍi puvvula sĕṁḍuna vesi
suṭṭabu mām̐ṭalāḍī soraṇagaṁḍla
yiṭṭĕ siggudoḍa ne nivvalimomaidenu
paṭṭi sammanam̐govula pannīru simmīne

(||emaṁ||)
munimuṁgiḍigi vachchi muchchaḍa navvulu navvi
tanum̐dāne pāḍavāḍī talabudaṁḍa
pŏnigi gaḍĕ dĕrasi buddulu nem̐ jĕppidenu
panigalavānivalĕ bāgā lichchīne

(||ĕmaṁ||)
vuyyālamaṁcha mĕkki vūsumani kām̐giliṁchi
yiyyĕḍam̐ jĕlam̐gī naṭṭiṁṭilonanu
payyāḍi yalamelmaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu
vŏyyane radula na nnolalārisīne