ఏమాయ నింతలోనే యిదియెల్లాను
(॥పల్లవి॥)
ఏమాయ నింతలోనే యిదియెల్లాను
కాముని తంత్రములకుఁ గడుఁబోది గాదా
(॥ఏమా॥)
అతివిరహపుఁగాఁక నతని దూరితినంటా
మతిలోఁ బొడిఁబడేవు మాటిమాటికి
సతి నీవొక్కతెవేయా? జవ్వనాన బడలిన -
యతివలు పతుల నేమైనా నాడుదురు
(॥ఏమా॥)
పాయపువిభుఁడు నిన్నుఁ బట్టరాఁగా గోపానఁ
జేయిఁ దీసికొంటినంటాఁ జింతించేవు
యేయెడ నెవ్వరికైనా నీపాటి లేకుండితే
వోయమ్మ చవులౌనా వుడివోనిరతులు
(॥ఏమా॥)
చెనకునీకాఁగిట శ్రీవేంకటేశ్వరుఁ
జనుఁగొండ లొతైనంటాఁ సంచలించేవు
మనసిజుగరిడిలో మల్లడి నొక్కరొక్కరి -
పెనకువలకు నివి ప్రియమేకాదా
(||pallavi||)
emāya niṁtalone yidiyĕllānu
kāmuni taṁtramulagum̐ gaḍum̐bodi gādā
(||emā||)
adivirahabum̐gām̐ka nadani dūridinaṁṭā
madilom̐ bŏḍim̐baḍevu māḍimāḍigi
sadi nīvŏkkadĕveyā? javvanāna baḍalina -
yadivalu padula nemainā nāḍuduru
(||emā||)
pāyabuvibhum̐ḍu ninnum̐ baṭṭarām̐gā gobānam̐
jeyim̐ dīsigŏṁṭinaṁṭām̐ jiṁtiṁchevu
yeyĕḍa nĕvvarigainā nībāḍi leguṁḍide
voyamma savulaunā vuḍivoniradulu
(||emā||)
sĕnagunīgām̐giḍa śhrīveṁkaḍeśhvarum̐
janum̐gŏṁḍa lŏdainaṁṭām̐ saṁchaliṁchevu
manasijugariḍilo mallaḍi nŏkkarŏkkari -
pĕnaguvalagu nivi priyamegādā