Emaaya nimtalone yeggulela pattevu

ఏమాయ నింతలోనే యెగ్గులేల పట్టేవు
Language

(॥పల్లవి॥)
ఏమాయ నింతలోనే యెగ్గులేల పట్టేవు
సాముసేయఁగా నూరుపు చల్లరాదా నేను

(॥ఏమా॥)
యెగసక్కేలంటాను యేల నన్నుఁ దిట్టేవు
నగరాదా వూరకైన నాలోనను
వొగరాయనంటాను వురము దట్టుకొనేవు
మొగము నీవు చూచితే మొక్కరాదా నీకు

(॥ఏమా॥)
తివిరి కోపించెనంటా తెరవలతోఁ జెప్పేవు
చెమరించరాదా నాచెక్కులమీఁద
భ్రమసి నీకునీవే పంతములే నెరపేవు
సముకానఁ గానుక వొసఁగరాదా నీకు

(॥ఏమా॥)
అయ్యెడ సిగ్గువడితి నంటానే కొసరేవు
ముయ్యరాదా చన్నులు నామునిగొంగున
నెయ్యపుశ్రీవేంకటేశ నీవు నన్ను నేలితివి
చెయ్యంటఁగ నిచ్చకము సేయరాదా నీకు

(||pallavi||)
emāya niṁtalone yĕggulela paṭṭevu
sāmuseyam̐gā nūrubu sallarādā nenu

(||emā||)
yĕgasakkelaṁṭānu yela nannum̐ diṭṭevu
nagarādā vūragaina nālonanu
vŏgarāyanaṁṭānu vuramu daṭṭugŏnevu
mŏgamu nīvu sūside mŏkkarādā nīgu

(||emā||)
tiviri kobiṁchĕnaṁṭā tĕravaladom̐ jĕppevu
sĕmariṁcharādā nāsĕkkulamīm̐da
bhramasi nīgunīve paṁtamule nĕrabevu
samugānam̐ gānuga vŏsam̐garādā nīgu

(||emā||)
ayyĕḍa sigguvaḍidi naṁṭāne kŏsarevu
muyyarādā sannulu nāmunigŏṁguna
nĕyyabuśhrīveṁkaḍeśha nīvu nannu nelidivi
sĕyyaṁṭam̐ga nichchagamu seyarādā nīgu